‘మహేష్ బాబు’కు అర్బన్ డిక్షనరీలో కొత్త అర్థం

  • Publish Date - February 1, 2019 / 09:55 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతుంది. పేర్లకు నిర్వచనాలు చెప్పే ‘అర్బన్ డిక్షనరీ’ మహేష్ బాబు పేరుకు సరికొత్త అర్థం చెప్పింది. దీంతో అతని ఫ్యాన్స్ ఆనందానికి అంతులేదు. అర్బన్ డిక్షనరీలో ఏదైనా పేరు టైప్ చేస్తే ఆ పేరుకు అర్థాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.

ఇలా మహేష్ పేరు టైప్ చేయగానే ‘‘మహేష్ బాబు తెలుగు యాక్టర్. అమ్మాయిలంతా అతని ప్రేమలో పడిపోతారు. అందరూ అతన్ని ప్రిన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అతను చాలా ఆకర్షనీయంగా, అందంగా ఉంటాడు. నేను అతన్ని ఓ సినిమాలో చూశా అతను చాలా హాట్‌గా ఉన్నాడు’’ అని తెలిపింది.  ఇటీవల మహేష్ బాబు అభిమానులు కొందరు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌‌గా చక్కర్లు కొడుతోంది.