భలే చేసిందే: మీరూ చేయగలరా? టిక్ టాక్ వీడియో వైరల్!

  • Publish Date - November 24, 2019 / 06:33 AM IST

ఈ మధ్య యుత్ నుంచి ముసలివాళ్ల వరకు అందరూ టిక్ టాక్ వీడియోల్లో మునిగితేలుతున్నారు. రోజుకో టిక్‌టాక్ వీడియో చేయనిదే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. ఇక మరికొంతమంది పొద్దస్తమానం టిక్‌టాక్ వీడియోల్లోనే బతికేస్తుంటారు.

అయితే ఈ క్రమంలో తాజాగా ఓ అమ్మాయి టిక్ టాక్ వీడియోలో తన చేతి వేళ్లను కదుపుతూ చేసిన మ్యాజిక్‌ చూస్తే మీ కళ్లను మీరే నమ్మరు. కచ్చితంగా ఆ వీడియోను ఒకటికి రెండుసార్లు మళ్లీ మళ్లీ ప్లే చేసి ఆమెలా చేసేందుకు ప్రయత్నిస్తారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నవంబరు 21న పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 6.7 మిలియన్ మంది వీక్షించారు. అంతేకాదు 1.6 లక్షల మంది రీట్విట్ చేసుకున్నారు.