గాలిపటాన్ని ఎగరేస్తున్న కోతి…మీరూ చూడండి

  • Publish Date - April 27, 2020 / 10:21 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రహదారులు ఖాళీగా కనిపించటంతో అడవుల్లో నివసించే జంతువులన్ని రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇక కోతుల చేసే హంగామా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరేద్లు. తాజాగా ఓ కోతి గాలిపటం ఎగరేస్తు కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఒకవైపు కరోనా భయంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావటానికి భయపడిపోతున్నాయి. కానీ ఓ కోతి మాత్రం ఇంటి మేడ పై నుంచి గాలి పటం ఎగరవేస్తు కనిపించింది. ఆ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ లో గురువారం(ఏప్రిల్ 16, 2020)న పోస్టు చేశారు. ఆ వీడియోలో కోతి గాలిపటానికి కట్టి ఉన్న దారాన్ని లాగటం కనిపిస్తోంది. దారాన్ని పూర్తిగా లాగి గాలిపటాన్ని తన చేతితో పట్టుకుంటుంది.

‘లాక్ డౌన్ కారణంగా పరిణామం వేగంగా వృద్ధి చెందుతోంది. కోతి గాలిపటాన్ని ఎగరవేస్తుంది. అవును ఇది నిజంగా కోతినే’అనే క్యాప్షన్ తో సుశాంత్ నందా వీడియోని షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోని 30వేలకు మంది వీక్షించారు. 3వేలకు పైగా లైకులు వచ్చాయి.