విరాట్ కోహ్లీ టిక్ టాక్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమిత్ యాదవ్ అనే వ్యక్తి టిక్ టాక్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్టు చేశాడు. కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో బిజీగా ఉంటే కోహ్లీ ఢిల్లీలో ఎలా ఉంటాడని ప్రశ్నలు మొదలయ్యాయి. చివరకు అందులో ఉన్న వ్యక్తి కోహ్లీ కాదు. అచ్చం అతనిలా ఉన్న వ్యక్తి ఢిల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన వీడియో అది.
దీనిపై లక్షల మంది లైక్‌లు కొట్టారు. అచ్చు విరాట్‌లా ఉన్నాడని విరాట్ కోహ్లీ ఒరిజినల్ అకౌంట్ కు వచ్చినంత స్పందన వచ్చింది. అయితే నెటిజన్లు కోహ్లీలా ఉన్నాడని తెలిసే లైక్ కొట్టారు. నిజంగా కోహ్లీ అయితే సెల్ఫీల కోసం ఎగబడి ఉండేవారంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.