బంగారు ఆక్టోపస్ బొమ్మలో ఉన్న ముత్యాన్ని చూశారా? చూసేందుకు సాధారణ వైట్ స్టోన్ లాగా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుంది.
బంగారు ఆక్టోపస్ బొమ్మలో ఉన్న ఈ ముత్యాన్ని ఓసారి లుక్కేయండి. చూడటానికి నార్మల్ వైట్ స్టోన్ లా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుందంట. ముత్యం విలువ 90 మిలియన్లు (రూ.630 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అంతేకాదు.. 27.65 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ ముత్యం చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ.. ఓ చిన్న సైజు పిల్లాడంత పరిమాణంలో ఉంటుంది.
సుమారు వెయ్యి ఏళ్ల పురాతనమైన ముత్యంగా రేయెస్ తెలిపాడు. ఫిలిపీన్స్లోని ఓ జాలరి నుంచి రేయెస్ అనే వ్యక్తి ఈ ముత్యాన్ని తీసుకున్నాడు. ఆ ముత్యం అంత ఖరీదు ఉంటుందని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియదని తెలిపాడు. ముత్యంలా కనిపించకపోవడం వల్ల దాన్ని విలువైన వస్తువుగా గుర్తించలేదని రేయెస్ చెప్పుకొచ్చాడు.
ఈ ముత్యాన్ని ఇటీవల పరిశీలించిన జియోలాజికల్ స్పెషలిస్టులు దీని విలువ 60 నుంచి 90 మిలియన్ డాలర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ముత్యాన్ని పట్టుకుని ఉన్న మిలమిల మెరిసే ఆక్టోపస్ బొమ్మను 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయడం విశేషం. ఈ ముత్యాన్ని త్వరలోనే ప్రపంచంలోని అన్ని మ్యూజియంల్లో ప్రదర్శిస్తానని రేయెస్ చెప్పాడు.
The gigapearl, an Ontario family’s heirloom tracing back when the grandfather gifted it, could be the largest natural pearl #Canada #philippines #vancouver #toronto #montreal pic.twitter.com/QiH4JHUaFb
— Millennials of Canada (@millennialsofCA) March 28, 2019