Mamata Banerjee plays ‘dhaank’: హుషారుగా ఢంకా మోగించిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుషారుగా ఢంకా మోగించారు. శరన్నవరాత్రుల సందర్భంగా కోల్ కతాలో ఓ కమ్యూనిటీ వారు ప్రారంభించిన దుర్గాపూజలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఢంకాను భుజంపై పెట్టుకుని రిబన్ కట్ చేసి మండపంలోకి అడుగుపెట్టారు మమతా బెనర్జీ. అనంతరం రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ తో కలిసి ఢంకా మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే మమతా బెనర్జీ మండపంలో ఉత్సాహంగా కనపిన తీరు అలరిస్తోంది.

Mamata Banerjee plays ‘dhaank’: హుషారుగా ఢంకా మోగించిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్

Mamata Banerjee plays ‘dhaank’: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుషారుగా ఢంకా మోగించారు. శరన్నవరాత్రుల సందర్భంగా కోల్ కతాలో ఓ కమ్యూనిటీ వారు ప్రారంభించిన దుర్గాపూజలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఢంకాను భుజంపై పెట్టుకుని రిబన్ కట్ చేసి మండపంలోకి అడుగుపెట్టారు మమతా బెనర్జీ. అనంతరం రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ తో కలిసి ఢంకా మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే మమతా బెనర్జీ మండపంలో ఉత్సాహంగా కనపడిన తీరు అలరిస్తోంది.

మరోవైపు, మమతా బెనర్జీపై మీమ్స్‌ పోస్టు చేస్తున్న ఏడుగురు యూట్యూబర్లపై తాజాగా కోల్‌కతాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒకరిని అరెస్టు చేశారు. గతంలో మమతా బెనర్జీ చేసిన ప్రసంగాలను వక్రీకరిస్తూ మీమ్స్‌ను పోస్టు చేశారని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం మమతా బెనర్జీ దేశంలోని ప్రతిపక్ష పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో ఇటీవలే బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా చర్చలు జరిపారు.

IAS officer Viral video: ‘కండోమ్‌లు కూడా కావాలా?’ అంటూ విద్యార్థినులతో ఐఏఎస్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు