31 Famous Brands: మనం రోజూ వాడే ఈ 31 ఫేమస్ బ్రాండ్ల పూర్తి పేర్లు మీకు తెలుసా?

మన దైనందిన జీవితంలో ఎన్నో బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటాం. కొందరు చిన్నారులు, యువత పట్టుబట్టీ మరీ బ్రాండెడ్ వస్తువులను కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతుంటారు. మనం ఎన్నో బ్రాండెడ్ వస్తువులను ప్రతిరోజు వాడుతున్నప్పటికీ మనకు కనీసం ఆ సంస్థల ఫుల్ ఫాం కూడా తెలియదు. బీఎస్ఏ, అమూల్, బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్ లకి మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది. అయితే, వాటి ఫుల్ ఫాం మీకు తెలుసా? వాటితో పాటు మరో 28 రకాల బ్రాండ్ల ఫుల్ ఫాంలను తెలుసుకుందాం…

31 Famous Brands: మనం రోజూ వాడే ఈ 31 ఫేమస్ బ్రాండ్ల పూర్తి పేర్లు మీకు తెలుసా?

31 Famous Brands

31 Famous Brands: మన దైనందిన జీవితంలో ఎన్నో బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటాం. కొందరు చిన్నారులు, యువత పట్టుబట్టీ మరీ బ్రాండెడ్ వస్తువులను కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతుంటారు. మనం ఎన్నో బ్రాండెడ్ వస్తువులను ప్రతిరోజు వాడుతున్నప్పటికీ మనకు కనీసం ఆ సంస్థల ఫుల్ ఫాం కూడా తెలియదు. బీఎస్ఏ, అమూల్, బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్ లకి మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది. అయితే, వాటి ఫుల్ ఫాం మీకు తెలుసా? వాటితో పాటు మరో 28 రకాల బ్రాండ్ల ఫుల్ ఫాంలను తెలుసుకుందాం…

1.బీఎస్ఏ: దీని ఫుల్ ఫాం ‘బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్’ కంపెనీ లిమిటెడ్. దీన్ని 1861లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బర్మింగ్‌హామ్ లో ఉంది.
2. అమూల్: ‘ఆనంద్ మిల్క్ ఫెడరేషన్ యూనిట్ లిమిటెడ్’.. దీన్ని 1946లో స్థాపించారు.
3.బీఎండబ్ల్యూ: ‘బవేరియన్ మోటార్ వర్క్స్’… ఈ కార్లంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.
4.హెచ్‌టీసీ: ‘హై టెక్ కంప్యూటర్స్’… ఇది తైవానీస్ కంపెనీ.
5.హెచ్‌డీఎఫ్సీ: ‘హౌసింగ్ డెవెలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్’. ఇది ఇండియన్ హౌసింగ్ కంపెనీ హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ ను 1994లో రిజిస్ట్రర్ చేసుకుంది.

6.ఏఎన్డీ (అండ్): దీని ఫుల్ ఫాం ‘అనితా డోంగ్రీ’… ప్రత్యేక దుస్తుల సంస్థ.
7.బీపీఎల్: ‘బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్’.. ఇది టెలివిజన్ బ్రాండ్.
8.డీకేఎన్‌వై: ‘డొన్నా కరణ్ న్యూ యార్క్’.. డొన్నా కరణ్ అనేది దాన్ని స్థాపించిన వ్యక్తి పేరు. న్యూయార్ ఆ సంస్థను స్థాపించిన ప్రదేశం.
9.ఈఎస్పీఎన్: ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రొగ్రామింగ్ నెట్వర్క్’’.. ఇది క్రీడల టీవీ ఛానెల్.

10.ఎఫ్సీయూకే: ఇది ‘ఫ్రెంచ్ కనెక్షన్’ ఫ్యాషన్ దుస్తుల కంపెనీ.. గతంలో ‘ఎఫ్సీహెచ్‌కే’గా దీని పేరు ఉండేది. ఈ సంక్షిప్త నామాన్ని ‘ఫాక్సెస్ బిట్వీన్ హాంకాంగ్ అండ్ అండన్’కు వాడేవారు. దీంతో వివాదం నెలకొంది. దీంతో ఆ సంస్థ పేరును ‘ఎఫ్సీయూకే’గా మార్చారు.
11.ఎఫ్ఐఏటీ: ‘ఫ్యాబ్రికా ఇటాలియానా ఆటోమొబిలి టోరియో’.. అంటే ఇటాలియాన్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ఆఫ్ టురిన్ అని ఇంగ్లిష్ లో అర్థం.
12. హెచ్‌పీ: ‘హ్యూలెట్ ప్యాకర్డ్’… దీన్ని అమెరికా బహుళజాతి సమాచార, సాంకేతిక సంస్థ నిర్వహిస్తుంది.
13.ఐబీఎం: ‘ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్’ 1911 జూన్ 16న దీన్ని స్థాపించారు.

14: ఐసీఐసీఐ బ్యాంక్: ‘ఇండస్ట్రియల్ క్రెటిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’. దీన్ని 1994లో స్థాపించారు.
15. ఐటీసీ: ‘ఇండియన్ టొమాకో కంపెనీ’… మొదట దీనిపేరు ‘ఇంపెరియల్ టొబాకో కంపెనీ’గా ఉండేది.
16. ఇంటెల్: దీని పూర్తి పేరు ‘ఇంటెగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్’.
17. జేబీఎల్: ‘జేమ్స్ బుల్లాఫ్ లాన్సింగ్’.. తన పేరునే తన సంస్థకు జేబీఎల్ పెట్టుకున్నారు.

18. ఐఆర్సీటీసీ: ‘ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’.. మన రైల్వే సంస్థ.
19. ఎల్జీ: ‘లక్కీ గోల్డ్ స్టార్’… ఇది బహుళజాతి ఎలక్ట్రానిక్స్ సంస్థ.


20. ఎంఆర్ఎఫ్: ‘రబ్బర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ’.. చెన్నైలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
21. డీఎల్ఎఫ్: ’ఢిల్లీ ల్యాండ్, ఫైనాన్స్’. సీహెచ్ రాఘవేంద్ర దీన్ని 1946లో స్థాపించారు.

22. అడిడస్: ఈ సంస్థ వ్యవస్థాపకుడు ‘అడాల్ఫ్ దస్లెర్’ పేరు సంక్షిప్త నామమే అడిడస్.
23. హెచ్&ఎం: ‘హెన్నీస్&మౌరిట్జ్’. ఇది స్వీడన్ ఫ్యాషన్ దుస్తుల సంస్థ.
24. విప్రో: ‘వెస్ట్రన్ ఇండియా ప్రొడక్ట్స్ లిమిటెడ్’.. గతంలో ‘వెస్ట్రన్ ఇండియా పాం రిఫైండ్ ఆయిల్ లిమిటెడ్’ గా ఉండేది.
25. హెచ్సీఎల్: ‘హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్’… దీన్ని శివ నాడార్ 1976, ఆగస్టు 11న స్థాపించారు.

26. హెచ్‌ఎంటీ: ‘హిందుస్థాన్ మిషన్ టూల్స్’… 1953లో ఈ పబ్లిక్ సెక్టార్ సంస్థను స్థాపించారు.
27. ఎండీహెచ్: ‘మహాషియాన్ డి హాట్టీ’ లిమిటెడ్ సంస్థను 1919లో స్థాపించారు.
28. ఎన్డీటీవీ: ‘న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్’.. ప్రనోయ్ రాయ్, రాధిక దీన్ని 1988 లో స్థాపించారు.

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 15 బ్రిడ్జిలు..
29. పీవీఆర్: ‘ప్రియా విలేజ్ రోడ్ షో’ భారత్ లోని అతి పెద్ద మల్టీప్లెక్స్ సినిమా చైన్స్ సంస్థ.
30. టీవీఎస్: ‘టి.వి. సుందరం’ అయ్యంగర్ దీన్ని స్థాపించారు. టీవీఎస్ మోటార్ కంపెనీగా కొనసాగుతోంది.
31. వొడాఫోన్: ‘వాయిస్ డేటా అండ్ ఫొన్’.. 1991లో దీన్ని స్థాపించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..