Bear Viral video: కారు డోరు తెరిచి లోపలికి వెళ్ళిన ఎలుగు బంటి.. వీడియో వైరల్

పార్కు చేసి ఉన్న కారు వద్దకు మెల్లిగా వెళ్ళింది ఓ ఎలుగు బంటి. అనంతరం ఆ కారు డోరును తెరిచి అందులోకి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని కాలెరాడోకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలుగు బంటి కారు డోరును తేలికగా తీసేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారుకు లాక్ వేయకపోవడంతో ఎలుగు బంటి డోరును తీయగలిగింది. అనంతరం అందులోకి వెళ్ళి ఆహారం కోసం చూసింది.

Bear Viral video: కారు డోరు తెరిచి లోపలికి వెళ్ళిన ఎలుగు బంటి.. వీడియో వైరల్

Bear Viral video: పార్కు చేసి ఉన్న కారు వద్దకు మెల్లిగా వెళ్ళింది ఓ ఎలుగు బంటి. అనంతరం ఆ కారు డోరును తెరిచి అందులోకి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని కాలెరాడోకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలుగు బంటి కారు డోరును తేలికగా తీసేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారుకు లాక్ వేయకపోవడంతో ఎలుగు బంటి డోరును తీయగలిగింది. అనంతరం అందులోకి వెళ్ళి ఆహారం కోసం చూసింది.

అందులో ఆహారం దొరకకపోవడంతో కారు దిగి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాలు అన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ కారులో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే అవి పాడైపోయి ఉండేవాని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలుగు బంట్లు కూడా కార్ల డోర్లను తీసుకుని లోపలికి వెళ్తాయని తనకు ఇప్పుడే తెలిసిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. జనావాసాల్లోకి ఎలుగు బంట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్లు చేశారు.

NALCO Recruitment : నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ