Traffic Control: ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో ఈ హోంగార్డ్ స్టైలే వేరు.. వీడియో చూస్తే మీరూ ఫిదా అవుతారు..

పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అంటే కష్టంతో కూడుకున్నపనే.. ఇక, సిగ్నల్స్ లేకుండా చేతులు ఊపుతు, సంజ్ఞలతో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చెమటలు పట్టడం ఖాయం. కానీ మీరుచూసే వీడియోలో ఓ హోంగార్డ్ తనదైన శైలిలో ..

Traffic Control: ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో ఈ హోంగార్డ్ స్టైలే వేరు.. వీడియో చూస్తే మీరూ ఫిదా అవుతారు..

traffic control

Traffic Control: పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అంటే కష్టంతో కూడుకున్నపనే.. ఇక, సిగ్నల్స్ లేకుండా చేతులు ఊపుతు, సంజ్ఞలతో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చెమటలు పట్టడం ఖాయం. కానీ మీరుచూసే వీడియోలో ఓ హోంగార్డ్ తనదైన శైలిలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మూడు కూడళ్ల వద్ద చేతులు చూపుతూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హోగార్డును సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Man Selfie With Fish: అయ్యయ్యో..! చేపకు బదులు ఫోన్‌ను నీటిలోకి విసిరేసిన వ్యక్తి.. నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్న వీడియో

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తనదైన శైలిలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. డెహ్రాడూన్ లోని సిటీ హార్ట్ హాస్పిటల్ సమీపంలో జోగేంద్ర విధులు నిర్వహిస్తున్నాడు. చేతులను వినూత్నంగా ఊపుతూ, సంజ్ఞలు చేస్తూ వాహనదారులతో పాటు చూపరులను ఆకట్టుకుంటున్నాడు. జోగేంద్ర ఎలాంటి విసుగులేకుండా తన డ్యూటీ సమయంలో ఉత్సాహంగా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నాడు. అయితే.. తన ట్రాఫిక్ నియంత్రణ స్టైల్ ను ప్రజలు ఆస్వాదిస్తున్నారని జోగేంద్ర అన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఆగినప్పుడు వారు విసుగు చెందకుండా తాను తనదైన శైలిలో ట్రాఫిక్ నియంత్రణ విధానాన్ని ఆచరిస్తున్నట్లు తెలిపాడు.

హోంగార్డ్ జోగేంద్ర కుమార్ ట్రాఫిక్ నియంత్రణ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జోగేంద్ర కుమార్ ను మెచ్చుకుంటున్నారు. జోగేంద్ర ట్రాఫిక్ ను నియంత్రించే తీరు చూడముచ్చటగా ఉందంటూ అభినందిస్తున్నారు.