Monkeys Social Media : కోతులకూ పాకిన సోషల్ మీడియా పిచ్చి

పాతకాలంలో ఒక సామెత ఉంది. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని... కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి మనుషుల నుంచి కోతులకు పాకింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Monkeys Social Media : కోతులకూ పాకిన సోషల్ మీడియా పిచ్చి

Monkeys On Social Media

Monkeys Social Media : స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చి… అనేక రకాల సోషల్ మీడియాప్లాట్ పాంస్ వచ్చిన తర్వాత జనాలు ఎంత బిజీ అయిపోయారో వేరే చెప్పక్కర్లేదు. ఇంట్లో కూడా ఒకరినొకరు మాట్లాడుకోనంతగా సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. ఇదే వ్యాధి ఇప్పుడు కోతులకు కూడా అబ్బింది.

పాతకాలంలో ఒక సామెత ఉంది. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని… కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి మనుషుల నుంచి కోతులకు పాకింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మొబైల్ ను రెండు కోతుల ముందు ఉంచాడు. దానిలో ఓపెన్ చేసి ఉన్న సోషల్ మీడియా పోస్టులను కోతులు స్క్రోల్ చేసి మరీ చూస్తున్నాయి. ఇంతలో ఒక పెద్ద కోతి వచ్చి అది కూడా సోషల్ మీడియా పోస్టులు చూడటం మొదలు పెట్టింది. వెనుక నుంచి చిన్న కోతి దాన్ని పిలుస్తుండటంతో ఇష్టం లేక వెనక్కి తిరిగివెళ్లింది.

ఈ పోస్టును షేర్ చేసి ‘‘క్రేజ్ ఆఫ్ సోషల్ మీడియా’’ అని పోస్టు చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. మనుషులే కోతులకు ఇవన్నీ నేర్పించి, నిజంగానే ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చేస్తారేమో అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సోషల్ మీడియానా మజాకా అంటున్నారు.

మనుషులు చెడిపోయింది కాక, కోతులను కూడా చెడగొట్టేస్తున్నారని మరికొందరు జోకులు వేస్తున్నారు. ఈరకంగా తమకు తోచిన రీతిలో నెటిజన్లు ఈవీడియోకు కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓసారి చూసెయ్యండి ఆ వీడియో.