వైరల్ వీడియో:పిల్లలకోసం ప్రాణాలకు తెగించిన తల్లిపక్షి..అమ్మప్రేమకు తలవంచిన రైతన్న 

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 05:36 AM IST
వైరల్ వీడియో:పిల్లలకోసం ప్రాణాలకు తెగించిన తల్లిపక్షి..అమ్మప్రేమకు తలవంచిన రైతన్న 

ఒక పొలంలో తల్లి పక్షి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లకు ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది ఆ తల్లిపక్షి. పొలంలోని పక్షి గుడ్లను గమనించిన ఓ రైతు ఓ ట్రాక్టర్ ను నడుపుకుంటూ వచ్చాడు. ఆ ట్రాక్టర్ వెనుక మరో యంత్రాన్ని కూడా కట్టి ఉంది. ఆ ట్రాక్టర్ ను నడుపుకుంటూ వచ్చిన రైతు ఓ ప్రదేశంలో పక్షి ఉండటాన్ని గమనించాడు. ట్రాక్టను నడుపుకుంటూ వెళితే అది ఎగిరిపోతుందిలే అనుకున్నాడు. కానీ ఆ తల్లి పక్షి గుడ్లపై నుంచి కదలేదు. నా ప్రాణం పోయినా ఫరవాలేదు…నా బిడ్డలు మాత్రం ప్రాణాలతో ఉండాలనే దృఢ సంకల్పంతో..ట్రాక్టర్ మీదకు వచ్చేసినా కదల్లేదు.

అలా  ట్రాక్టర్ పై వచ్చిన  రైతు పక్షి ఏం చేస్తుందో చూడాలనుకున్నాడో ఏమో..ఆ తల్లి ప్రేమను పరీక్షించాలనుకున్నాడేమో జాగ్రత్తగా..పక్షి పక్కనుంచి పోనిచ్చాడు. అయినా ఆ తల్లిపక్షి కదల్లేదు..ధైర్యాన్ని కోల్పోలేదు. గుడ్లపై నుంచి కదల్లేదు. గుడ్లపై తన రెక్కలను యాంత్రానికి అడ్డుగా పెట్టింది. ట్రాక్టర్ మీదనుంచి వెళితే పక్షి ప్రాణం ఎంత? పక్షి గుడ్లు చితికిపోవటం ఎంత చెప్పండి. అయినా తన గుడ్లను కాపాడుకోవటానికి తల్లి పక్షి చనిపోవటానికి కూడా సిద్దమైందని ఆ రైతన్న గుర్తించాడు. ఆ తల్లిపక్షి ప్రేమకు..దైర్యానికి..త్యాగానికి తల వంచాడు. నెమ్మదిగా…పక్షికి గానీ..దాని గుడ్లకు గానీ ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ట్రాక్టను పోనిచ్చాడు. 

కానీ ట్రాక్టర్ వెనుకాల ఉన్న యంత్రం తల్లిపక్షికి తగిలేలా ఉంది..దీంతో పక్షి దగ్గరకు ఆ యంత్రం రాగానే దాన్ని పైకి ఎత్తి జాగ్రత్తగా యంత్రాన్ని పోనిచ్చాడు రైతు.దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక వీడియో ని పంచుకున్నారు.