Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్

ఢిల్లీ మెట్రో రోజుకో వార్తతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన రచ్చ పీక్స్‌కి వెళ్లింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్

Delhi Metro

Delhi Metro : నిత్యం రైళ్లలో, బస్సులలో సీట్ల కోసం జనం తగవులాడుకోవడం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి పరిస్థితి చేయి జారిపోయేంతగా యుద్ధాలు జరిగిపోతుంటాయి. మధ్యలో చుట్టుపక్కల వారు కలగజేసుకుని కూల్ చేస్తుంటారు. ఇక ఢిల్లీ మెట్రో (delhi metro) విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ గొడవలు పెప్పర్ స్ప్రే (pepper spray) చల్లుకునే వరకు వచ్చి ఇతర ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయి.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఆగని డ్యాన్స్‌ల హంగామా.. భోజ్‌పురీ సాంగ్‌కి అమ్మాయి డ్యాన్స్ వీడియో వైరల్

ఢిల్లీ మెట్రో నిత్యం రకరకాల వార్తలతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య కీచులాటకు (fighting ) సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడటం మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. గొడవ హద్దులు దాటి ఎరుపు రంగు డ్రెస్ ధరించిన మహిళన తన తోటి ప్రయాణికురాలిపై  పెప్పర్ స్ప్రే చల్లి బెదిరించింది. దాని ప్రభావంతో ఇతర ప్రయాణికులకు దగ్గు (cough) మొదలై తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రో డ్రైవర్ చేసిన పని వైరల్.. అనౌన్స్‌మెంట్‌కి బదులు!

ఈ వీడియోని ForMenIndia అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఇద్దరు మహిళలు ప్రవర్తించిన తీరు చూసి అందరూ మండిపడుతున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (Delhi Metro Rail Corporation ) కూడా ఈ వీడియోపై స్పందించి వీరి కోచ్ నంబర్ కోసం ఎంక్వైరీ చేసింది. అసలు వీరిద్దరి మధ్యా గొడవకు కారణం ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ వీరి ప్రవర్తన.. తోటి మహిళా ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చేయడం చూసి జనం కోపంగా కామెంట్లు పెడుతున్నారు. కేవలం ఆత్మరక్షణ కోసం వాడాల్సిన పెప్పర్ స్ప్రే ఒక సీటు కోసం తగవులాటలో ప్రయోగించడమేంటని జనం అభిప్రాయపడుతున్నారు. మెట్రో అధికారులు ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతున్నారు.