ఏబీసీడీ.. ‘మెల్ల మెల్లగా’ వీడియో సాంగ్..

రీసెంట్‌గా ఎబిసీడీ నుండి 'మెల్ల మెల్లగా' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, సిడ్ శ్రీరామ్, అదితి భవరాజు కలిసి పాడారు..

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 01:01 PM IST
ఏబీసీడీ.. ‘మెల్ల మెల్లగా’ వీడియో సాంగ్..

రీసెంట్‌గా ఎబిసీడీ నుండి ‘మెల్ల మెల్లగా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, సిడ్ శ్రీరామ్, అదితి భవరాజు కలిసి పాడారు..

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా..ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని కలిసి నిర్మాణంలో, డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కుతున్న మూవీ.. ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ).. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న భరత్, హీరో ఫ్రెండ్‌గా నటిస్తున్నాడు.

రీసెంట్‌గా ఎబిసీడీ నుండి ‘మెల్ల మెల్లగా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, సిడ్ శ్రీరామ్, అదితి భవరాజు కలిసి పాడారు. చక్కటి లొకేషన్స్‌లో బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేసారు ఈ సాంగ్.. జుదా శాండీ ట్యూన్, రామ్ విజువల్స్ బాగున్నాయి. అల్లు శిరీష్, రుక్సార్ పెయిర్ అండ్ కెమిస్ట్రీ కూడా బాగుంది.
Also Read : బ్రాండ్ అంటే ఇదే : హైదరాబాద్ ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు

రిచ్ కిడ్ అయిన ఒక కుర్రాడికి, ఇండియాలో పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన ఏబీసీడీ మూవీని, అదే పేరుతో తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నారు.. మే 17 న ఏబీసీడీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : జుదా శాండీ, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : వర్మ, కొరియోగ్రఫీ : విజయ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని.

వాచ్ వీడియో సాంగ్..