నేను మగాడినే నమ్మండి… ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన

నేను మగాడినే నమ్మండి… ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన

ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ తాను మగాడినే నమ్మండంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నాడు. సరదాగా చేసిన ట్వీట్ తనపై విపరీతమైన ట్రోల్స్ వచ్చేలా చేసింది. ఏప్రిల్ 29 సోమవారం రాత్రి పుట్టినరోజు వేడుకను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జరుపుకుంటున్నానని పోస్టు చేశాడు. 

అంతే డిన్నర్ విత్ బాయ్ ఫ్రెండ్ అని పోస్టు చేయడంతో పాటు కలిసి ఓ ఐదేళ్ల నుంచి ఉంటున్నాం(టు గెదర్ ఫర్ ఫైవ్ ఇయర్స్)అని ట్వీట్ చేశాడు. దానికి నెటిజన్లతో పాటు అభిమానులు కూడా ఫాల్కనర్‌ను అపార్థం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఫేసర్‌పై తీవ్రంగా విమర్శలు కురిశాయి. 
Also Read : నేను మగాడినే నమ్మండి… ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన

ఆ పోస్టుకు స్సందించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాన్ టైట్, డేవిడ్ వార్నర్, బ్రెట్ లీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోస్టు చూసిన వాళ్లంతా తనను అపార్థం చేసుకుంటుండటంపై వివరణ ఇచ్చుకున్నాడు. ‘నేను గే కాదు.. అందరూ పోస్టు గురించి అపార్థం చేసుకుంటున్నారు. ఎల్బీజీటీ కమ్యూనిటీ అద్భుతమైన సహకారం అందింది. ఆదరణ ఎప్పటికీ ఆదరణే. అతను కేవలం ఐదేళ్లుగా నా రూమ్మేట్.. బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఇది కేవలం సరదాకి చేసిన పోస్టు అంతే’ అని వివరణ ఇచ్చుకున్నాడు.
Also Read : సన్‌రైజర్స్‌తో బంధం మాటల్లో చెప్పలేను: వార్నర్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Birthday dinner with the boyfriend (best mate!!!) @robjubbsta and my mother @roslyn_carol_faulkner ❤️❤️❤️ #togetherfor5years

A post shared by James Faulkner (@jfaulkner44) on