తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!

సాయితేజ, తరుణి సింగ్ జంటగా, శివన్ దర్శకత్వంలో, ఎస్.ఆర్.సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సంతోష్ రెడ్డి నిర్మించిన 'శివన్', 'ది ఫినామినల్ లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 30, 2019 / 12:45 PM IST
తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!

సాయితేజ, తరుణి సింగ్ జంటగా, శివన్ దర్శకత్వంలో, ఎస్.ఆర్.సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సంతోష్ రెడ్డి నిర్మించిన ‘శివన్’, ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్..

అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ సినిమాల తరహాలో ఇప్పటికి చాలా సినిమాలొచ్చాయి. ఇంకొన్ని రాబోతున్నాయి. అడల్ట్ కంటెంట్, బూతులు తిట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, రక్తం వచ్చేలా కొట్టుకోవడం, సినిమాలో ఏదో విషయం ఉంది అనేలా టీజర్, ట్రైలర్ కట్ చెయ్యడం.. సరిగ్గా ఇలానే ఉంది శివన్ మూవీ టీజర్.. సాయితేజ, తరుణి సింగ్ జంటగా, శివన్ దర్శకత్వంలో, ఎస్.ఆర్.సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సంతోష్ రెడ్డి నిర్మించిన సినిమా.. ‘శివన్’, ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్.. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
Also Read : హాట్ హాట్ ‘హూకప్’ సాంగ్

ఒక కుర్రాడికి తను ప్రేమించిన అమ్మాయిని తనే చంపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది టీజర్.. ఈ సినిమాకి కెమెరా : మీరన్, ఎడిటింగ్ : రామ్-సతీష్, మ్యూజిక్ : సిద్దార్థ్ సదాశివుని, ఫైట్స్ : రాబిన్ సుబ్బు నంబా, రామ్ సుంకర, కో-ప్రొడ్యూసర్ : పున్న మురళి.

వాచ్ శివన్ టీజర్..