మార్జావాన్ – ఫస్ట్ లుక్

రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ.. 'మార్జావాన్'.. ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 24, 2019 / 09:48 AM IST
మార్జావాన్ – ఫస్ట్ లుక్

రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ.. ‘మార్జావాన్’.. ఫస్ట్ లుక్ రిలీజ్..

ఏక్ విలన్ తర్వాత రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ.. ‘మార్జావాన్’.. తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మిలాప్ జవేరి డైరెక్ట్ చేస్తుండగా, టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, దివ్యా కోశ్లా కుమార్, మోనీషా అద్వాణీ, మధు భోజ్వాణీ, నిఖిల్ అద్వాణీ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా మార్జావాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రావణాసురుడి కటౌట్ ముందు రితేష్, సిద్ధార్థ్ విడివిడిగా నడుస్తున్న పోస్టర్స్‌తో పాటు, ఇద్దరూ కలిసి ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్న పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. రితేష్ ఈ సినిమాలో మూడు అడుగుల ఎత్తు ఉండే మరుగుజ్జు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తను ఎత్తుగా లేకపోయినా తన పగ ఎత్తెంతో చూపిస్తాడట రితేష్..

Read Also : కూల్‌గా.. క్రూరంగా.. అసురన్ – సెకండ్ లుక్..

నా ఎత్తు గురించి కాదు.. నేను వేసే ఎత్తుల గురించి చూడండి అని సవాల్ విసిరేలా తన రోల్ ఉంటుందట. రితేష్, సిద్ధార్థ్ నటించిన ఏక్ విలన్ మూవీకి మిలాప్ రైటర్‌గా పని చేశాడు. నవంబర్ 22న మార్జావాన్ విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : నిగమ్ బోమ్జాన్, ఎడిటింగ్ : మాహిర్ జవేరి.