సంతానం ‘డిక్కీలోనా’ సినిమాలో హర్భజన్ సింగ్

ఫేమస్ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చెయ్యనున్నాడు..

  • Published By: sekhar ,Published On : October 15, 2019 / 07:10 AM IST
సంతానం ‘డిక్కీలోనా’ సినిమాలో హర్భజన్ సింగ్

ఫేమస్ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చెయ్యనున్నాడు..

ఫేమస్ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ యాక్టర్‌గా మారుతున్నాడు. స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ అనే తమిళ సినిమాతో బజ్జీ తెరంగేట్రం చెయ్యనున్నాడు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌లో, కార్తీక్ యోగి దర్శకత్వంలో రూపొందనున్న ‘డిక్కీలోనా’ మూవీలో సంతానం త్రిపాత్రాభినయం చేయనున్నాడు.

అర్జున్, శంకర్‌ల కాంబోలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సినిమాలో గౌండుమణితో సెంథిల్ ‘డిక్కీలోనా’ ఆట గురించి చెప్పే సీన్ గుర్తుండే ఉంటుంది.. ఇప్పుడు అదే టైటిల్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న ‘డిక్కీలోనా’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం మూవీ టీమ్ హర్భజన్ సింగ్‌ను సెలెక్ట్ చేసింది.

Read Also : రూ.100 కోట్ల ధనుష్ ‘అసురన్’

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చియాన్ విక్రమ్ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. ‘డిక్కీలోనా’ షూటింగ్ నవంబర్‌లో స్టార్ట్ చేసి, 2020 ఏప్రిల్‌లో రిలీజ్ చెయ్యనున్నారు.