Women in Agriculture : వ్యవసాయరంగంలో కీలకంగా మారిన మహిళల పాత్ర !

వ్యవసాయ క్షేత్రాలలో స్త్రీలు రోజుకు సుమారు 7 నుండి 8 గంటల పాటు పనిలో నిమగ్నమై ఉంటారు. పనిలో సాంకేతిక పనిముట్లను తక్కువగా వాడటం శారీరక సామర్థ్యంతో ప్రధానంగా పనులను నిర్వహించడం వల్ల స్త్రీలు అధిక శ్రమ, అలసట చెందుతుండడమే కాక, పనులు సకాలంలో నిర్వహించ లేకపోతున్నారు.

Women in Agriculture : వ్యవసాయం భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది . గ్రామీణ ప్రాంత పేదరిక నిర్ములనకు ఒక పట్టుకొమ్మ లాంటిది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ 90 శాతం వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థపై మాత్రమే ఆధారపడి వున్నది , దీనిలో మహిళలే ప్రధాన భాగస్వాములుగా వున్నారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. విత్తనాలు విత్తడం మొదలుకొని కలుపు తీయడం , కోతకోడం వరకు వారే కీలకంగ వ్యవహరిస్తున్నారు , గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు బలం చేకూర్చడంలో కీలక పాత్రధారులుగ ఉన్నారు. మహిళా మూర్తులతో ముడిపడి ఉన్నా వ్యవసాయ రంగంలో.. వారి సహాయం లేకుండా వ్యవసాయ రంగంలో సాధికారతకథను సాధించలేము. కాబట్టి వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించావల్సిన అవసరం ఉంది.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

భారతదేశంలో వ్యవసాయం.. కుటుంబ పారంపర్యంగా సంక్రమించే వృత్తి. వ్యవసాయం కుటుంబ సంప్రదాయాలు, సామాజిక బాంధవ్యాలు, స్త్రీ, పురుషుల పాత్రలను నిర్ణయిస్తాయి. పరంపర వృత్తిగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, జీవనాధారం కోసం కావచ్చు, వ్యవసాయ కూలీలుగా కావచ్చు, భారతదేశ వ్యవసాయ రంగంలో స్త్రీల సంఖ్య, వారి పాత్ర ముఖ్యమైనదిగానే చెప్పుకోవాలి. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ భారతదేశంలో, దాదాపు 84% మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అందులో 33% మంది రైతులు కాగా, 47% మంది రైతు కూలీలుగా పనిచేస్తున్నారు.

వ్యవసాయం, జీవనాధార వృత్తి కావడంతో ఆర్థిక స్వాతంత్ర్యం, నిర్ణయాధికారం, అక్షరాస్యత, ఆరోగ్య సేవలతో నేరుగా ముడిపడి ఉంటుంది. గిట్టుబాటు ధర సరిగా లేకపోవడం, పంట నష్టాలు, దళారీల సమస్య వంటి సమస్యల వలన ఎక్కువగా రైతులు పేదరికంలోనే ఉంటున్నారు. దీంతో రైతుకూలీలుగా పనిచేసే మహిళలకు వేతనాల విషయంలో అసమానతలు ఎక్కువగా ఉంటాయి. అదే మహిళలు కుటుంబ వృత్తిలో భాగంగా భర్తలతో కలసి వ్యవసాయంలో పాల్గొంటే వారికి ఆర్థిక స్వాతంత్ర్యం నామ మాత్రంగానే ఉంటుంది. అందుకే భారత వ్యవసాయ రంగంలో లింగ అసమానత తీవ్రమైన సమస్యగా తయారైంది.

వ్యవసాయ క్షేత్రాలలో స్త్రీలు రోజుకు సుమారు 7 నుండి 8 గంటల పాటు పనిలో నిమగ్నమై ఉంటారు. పనిలో సాంకేతిక పనిముట్లను తక్కువగా వాడటం శారీరక సామర్థ్యంతో ప్రధానంగా పనులను నిర్వహించడం వల్ల స్త్రీలు అధిక శ్రమ, అలసట చెందుతుండడమే కాక, పనులు సకాలంలో నిర్వహించ లేకపోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణలో కూడా సాంకేతికరణ అందుబాటులో లేక పెట్టుబడికి, రాబడికి మధ్య వ్యత్యాసం పెరిగి వ్యవసాయం ఈ రోజు లాభసాటి ఉపాధిగా కొనసాగించే పరిస్థితిలో లేదు. స్త్రీలు అధిక సంఖ్యలో పనిచేసే వ్యవసాయ పనులలో శారీరక శక్తి వినియోగం కన్నా వృధా ఎక్కువ అవుతోంది. మహిళా శ్రామికుల పని సామర్థ్యం పెంచి వారి శ్రమను తగ్గించాల్సిన అవసరం ఉంది.

READ ALSO : Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!

మహిళలసాధికారత కోసం ఇతర రంగాల కంటే వ్యవసాయ రంగంలో అధిక చేయూత అందించాల్సి అవసరం ఉంది. ఈ రంగంలో స్త్రీలు కీలకంగ ఉన్నపటికీ వ్యవసాయ యంత్రాలను ఉప్పయోగించడంలో వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ యంత్రాలు మగవారు ఉప్పయోగించే విధముగా కఠినంగ ఉండటం దీనికి ఒక్క కారణం. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించాలనే కీలక దృష్టితో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం.

ట్రెండింగ్ వార్తలు