Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!

ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికారీ చేయవచ్చు. పురుగుమందు పోస్తే అదే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు, నీటిని కలుపుతూనే ఉంటుంది.

Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!

Machinery In Agriculture :

Machinery In Agriculture : వ్యవసాయంలో కూలీల కొరత అధికంగా ఉన్న నేపధ్యంలో ఆకొరతను పూరించేందుకు యంత్రాలు రంగప్రవేశం చేశాయి. కూలీలలో రోజుల తరబడి చేసే వ్యవసాయ పనులను యంత్రాలు గంటల వ్యవధిలోనే పూర్తిచేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రైతులు ముందుంటున్నారు.

వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు ఆవిష్కృతమవుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రిక పరికరాలను అందించేందుకు ప్రభుత్వం ఏటా రైతన్నలకు సబ్సిడీలను అందిస్తోంది. వ్యవసాయంలో యాంత్రపరికరాలను ఉపయోగించటం వల్ల రైతులకు అదనపు శ్రమతో పాటు ఖర్చు తగ్గుతుంది.

రైతులకు ఉపయోగకరమైన యంత్రాలు ;

చెరుకును కత్తిరించే యంత్రం; చెరకు సాగులో యాజమాన్య చర్యలు చేపట్టటంలో కూలీలే కీలకం. కూలీల కొరతతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గడను కింది వరకు కత్తిరించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చిన్న ముక్కలుగా చేస్తాయి వెంటనే మిల్లుకు తరలించుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. . ఒక్కో యంత్రం ధర రూ. 95 లక్షల వరకు ఉంది. రైతులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వం నుంచి రాయితీ ద్వారా పొందే అవకాశం ఉంది.

వరి కోత యంత్రం ; ఒకప్పుడు వరిని కోతలకు పదుల సంఖ్యలో కూలీల అవసరం ఉండేది. అయితే ప్రస్తుతం కూలీలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వరిని కోసేందుకు పలు కంపెనీలు తమ సంస్థ నుంచి యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వరి కోతలకు యంత్రాలను వాడుతున్నచోట కోత అనంతరం పొలంలో గడ్డి ముక్కలు ముక్కలుగా పడుతుంది. ఈ ముక్కలను గడ్డిని మోపులుగా చేసే యంత్రాలు గుండ్రంగా బేళ్లు మాదిరిగా గడ్డిని కట్టలు కడుతుంది.

మందుల పిచికారీ డ్రోన్లు ; 10 నిమిషాల వ్యవధిలోనే ఎకరం తోటలో పురుగుల మందు పిచికారి చేసే డ్రోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికారీ చేయవచ్చు. పురుగుమందు పోస్తే అదే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు, నీటిని కలుపుతూనే ఉంటుంది. ఈ యంత్రంతో సమయం ఆదాతో పాటు పురుగుల మందును పిచికారీ చేసే రైతులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తప్పుతుంది. ప్రస్తుతం ఈ యంత్రాలు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.