tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్

ap cm ys jagan : ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి. ఇండస్ట్రీలో కరోనా కారణంగా..దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు బంద్ కావడం, థియేటర్స్ తెరుచుకోకపోవడంతో చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ఆంక్షల నడుమ..షూటింగ్స్ జరుగుతున్నాయి. థియేటర్స్ కూడా తెరుచుకున్నాయి.

అయితే..ఈ క్రమంలో మళ్లీ వైరస్ పంజా విసురుతుండడంతో నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మళ్లీ ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారనే టెన్షన్ నెలకొంది. థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ చేస్తారనే కంగారు అందరిలో మొదలైంది. ఇదిలా ఉంటే..కోవిడ్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమతో పాటు అనుబంధ వ్యవస్థలకు.. ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లేక్సులు 2020 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు విద్యుత్‌ స్థిర చార్జీల చెల్లింపులను రద్దు చేయడంతో పాటు.. తదుపరి ఆరు నెలల కాలానికి చెందిన స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించింది.

థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటును..ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీప్లెక్సులకు లేదని చెప్పింది. చిత్ర పరిశ్రమ, అనుబంధ వ్యవస్థల్లో ఆధారపడిన కార్మికులకు లబ్ధిచేకూర్చేందుకు ఉత్తర్వలు జారీ చేశామని సమాచార పౌరసంబంధాల కార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ట్వీటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు