Narayanaswamy : భువనేశ్వరి, పురందేశ్వరిలపై డిప్యూటి సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, భువనేశ్వరి సోదరి పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Narayanaswamy : భువనేశ్వరి, పురందేశ్వరిలపై డిప్యూటి సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

Deputy CM Narayanaswamy

AP Deputy CM Narayanaswamy : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, నందమూరి కుటుంబ సభ్యులు, భువనేశ్వరి సోదరి అయిన పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నారాయణ స్వామి మాట్లాడుతు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ భువనేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ భువనేశ్వరి వల్లే చంద్రబాబును చంపితే భువనేశ్వరే చంపాలి అంటూ అంత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు భార్య భువనేశ్వరికి..కుమారుడు లోకేశ్ కు పదవీ కాంక్ష వచ్చేసిందని చంద్రబాబును చంపితే ఆమె చంపాలని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ ను తన భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ ను మోసం చేసి..ఇప్పుడు పురంధేశ్వరి సోదరి భర్త చంద్రబాబును కాపాడేందుకు తపనపడిపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

Kinjarapu Atchannaidu : చంద్రబాబుకి ప్రాణహాని ఉంది, అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగుంది- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. భువనేశ్వరిపై నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. నారాయణ స్వామి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి డైరెక్షన్ లో చంద్రబాబు ఆరోగ్యంపై కుట్ర జరుగుతోంది అంటూ ఆరోపించారు.