Kinjarapu Atchannaidu : చంద్రబాబుకి ప్రాణహాని ఉంది, అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగుంది- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

37 రోజులైంది. స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu : చంద్రబాబుకి ప్రాణహాని ఉంది, అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగుంది- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Kinjarapu Atchannaidu On Chandrababu Health (Photo : Facebook)

Kinjarapu Atchannaidu On Chandrababu Health : జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు. అంతేకాదు చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. విశాఖలో టీడీపీ కార్యలయంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

మొత్తం దేశాన్ని చీకట్లోకి నెట్టారు..
”నిరంతరం ప్రజల సమక్షంలో ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 37 రోజులైంది. స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆఖరికి ప్రాణాహాని కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి మొత్తం దేశాన్ని చీకట్లోకి నెట్టారు.

Also Read : మోదీ, జగన్ కలిసే ఆ పని చేస్తున్నారు : అరుణ్ కుమార్

చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యత..
చంద్రబాబు ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇంకా చంద్రబాబు గదిలో ఏసీ పెట్టలేదు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే వుందని డాక్టర్లు చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారు? నా తండ్రి మెడికల్ రిపోర్ట్ ఇవ్వండని లోకేశ్ విన్నవించుకుంటే డీఐజీ ఇవ్వడం లేదు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యుడు జగనే. దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం దగ్గరలోనే వుంది. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలి. ఎయిమ్స్ లో చికిత్స ఇప్పించాలి.

నిన్న రూ.3వేల కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు..
స్కిల్ కేసులో మొదట్లో రూ.3వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. ఎలక్ట్రోల్ ఫండ్ గా వచ్చిన మొత్తాన్ని కూడా కుంభకోణమంటున్నారు. వినతిపత్రం ఇస్తామంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారట. పరదాల మాటున సీఎం జగన్ వస్తున్నారు. రేపు(అక్టోబర్ 16) ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేస్తారట. అప్పుడే ఫోన్లు వస్తున్నాయి” అని అచ్చెన్నాయుడు అన్నారు.

Also Read : ఏపీ సీఎం జగన్‌పై టాలీవుడ్ హీరో తీవ్ర విమర్శలు