AP Minister Perni Nani : తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్

తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

AP Minister Perni Nani : తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్

Perni Nani

perni Nani serious on Prashant Reddy : తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నిధులు లేక ఏపీ..కేంద్రాన్ని అడుక్కుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని సీరియిస్ అయ్యారు.

నిధుల విషయంలో కేంద్రం వద్ద తాము బిచ్చం ఎత్తుకుంటే…కేసీఆర్ ఏం బిచ్చం ఎత్తుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్మును తెలంగాణ వ్యక్తులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారని ఆరోపించారు.

Minister Prashant Reddy : ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్రంపై కోపం ఉంటే ఏపీపై ఏడవటం ఎందుకని పేర్ని నాని ప్ర్రశ్నించారు. ‘మాకు రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటున్నాం..మీలా బయట కాలర్ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకోము’ అని ఎద్దేవా చేశారు. స్నేహం అంటే స్నేహం..ఢీ అంటే ఢీ జగన్ నైజం అన్నారు. ఇంటిబయట కాలర్ ఎగరేయడం..ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకోవడం అనేది జగన్ తత్వం కాదని స్పష్టం చేశారు.

రైతు ధర్నాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే అడ్డుక్కుతింటారని కామెంట్ చేసిన వారే ఇప్పుడు భిక్షమెత్తుకుంటున్నారని విమర్శించారు. ఏపీ నడవాలంటే నిధులు కావాలని..వాటి కోసం జగన్ కేంద్రానికి లొంగిపోయారని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.