Minister Prashant Reddy : ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
రైతు ధర్నాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

Prashant Reddy
Prashant Reddy comments over Jagan : రైతు ధర్నాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే అడ్డుక్కుతింటారని కామెంట్ చేసిన వారే ఇప్పుడు భిక్షమెత్తుకుంటున్నారని విమర్శించారు. ఏపీ నడవాలంటే నిధులు కావాలని..వాటి కోసం జగన్ కేంద్రానికి లొంగిపోయారని అన్నారు.
దేశం మొత్తం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. ప్రతి ఊరిలో బీజేపీ నాయకుల కింద మోటారు మీటర్లు పెట్టాలని పిలుపునిచ్చారు.
Minister KTR : కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే దేశవ్యాప్త ధర్నా : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాగైతే అందరం పని చేసినామో…ఆ విధంగానే ఇవాళ మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా రైతుల కోసం అందరం ఐక్యమత్యంగా పని చేయాలని అన్ని పార్టీల రైతులకు పిలుపునిచ్చారు.