Balineni Srinivasa Reddy : అంతు చూస్తా.. సొంత పార్టీ నేతలకు బాలినేని వార్నింగ్

సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Balineni Srinivasa Reddy : అంతు చూస్తా.. సొంత పార్టీ నేతలకు బాలినేని వార్నింగ్

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy : సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకులతో పాటు సొంత పార్టీ నేతలు తనపై కుట్ర పన్నుతున్నారని బాలినేని ఆరోపించారు. తనపై కుట్ర పన్నుతున్నవారెవరో తనకు తెలుసన్నారు బాలినేని. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు బాలినేని. సొంత పార్టీ నేతల కుట్రలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని బాలినేని చెప్పారు. ఆధిపత్యం కోసమే తనపై కుట్రలు జరుపుతున్నారని ఫైర్ అయ్యారు బాలినేని. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కొన్ని రోజుల క్రితం తమిళనాడులో ఒంగోలుకి చెందిన వ్యాపారులు బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బుతో పట్టుబడిన ఘటన, అల్లూరు బాలినేనిని ఓ మహిళ అడ్డుకున్న ఘటన, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ ఘటన, చెన్నైలో పట్టుబడిన డబ్బు ఘటన.. ఈ నాలుగు ఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తనకు అంటగట్టి తన గురించి చెడు ప్రచారం చేశారని బాలినేని ఆగ్రహంగా ఉన్నారు.

తెరవెనుక తనపై కుట్ర జరుగుతోందని బాలినేని అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ తో పాటు ఆయన అనుచరవర్గం, వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని బాలినేని వాపోయారు. కుట్రలు పన్నుతున్న వారిపై త్వరలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, వారి కాల్ డేటా కు సంబంధించిన వివరాలను తెప్పించబోతున్నానని బాలినేని చెప్పారు.

Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్

తనపై కుట్ర పన్నుతున్న సొంత పార్టీ నేతలు వారి పద్ధతి మార్చుకునేందుకు ఒక చాన్స్ ఇస్తున్నట్లు బాలినేని చెప్పారు. చాన్స్ ఉపయోగించుకుని వాళ్లు పద్ధతి మార్చుకుంటే సరే, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలినేని హెచ్చరించారు. తనపై కుట్ర పన్నుతున్న వారి పేర్లను మీడియా ముందుకు బయటపెడతానని బాలినేని వార్నింగ్ ఇచ్చారు.