Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్

అమరావతిని స్మశానం అన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడి భూములను ఎకరా రూ.10కోట్లకు ఎలా అమ్ముతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తారా?

Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్

Chandrabau On Amaravati Lands

Chandrababu On Amaravati Lands : రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములను విక్రయించాలని, భవనాలను లీజుకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సీఎం జగన్ భావించారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పార్టీ ముఖ్య నేతలతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో.. జగన్ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని స్మశానం అన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడి భూములను ఎకరా రూ.10కోట్లకు ఎలా అమ్ముతుందని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లు అయినా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తారా? అని చంద్రబాబు నిలదీశారు.(Chandrababu On Amaravati Lands)

Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు

డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి ఓటింగ్ శాతం పెరగలేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే దీనికి ప్రధాన కారణం అన్నారు చంద్రబాబు. గత ఎన్నికలకు ఉపఎన్నికలతో పోలిస్తే వైసీపీకి కనీసం 10వేల ఓట్లు కూడా అదనంగా పడలేదన్నారు. ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసుని 50ఏళ్లకు పెంచి లబ్దిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం దారుణం అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

నిధుల లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్దాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. పంట బీమా సాయంలో నిజమైన రైతులకు లబ్ది జరగడం లేదన్నారు చంద్రబాబు.

”ఇన్నాళ్లూ అమరావతిని స్మశానమంటూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే భూములను ఎకరానికి రూ.పది కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతోంది? అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని సీఎం జగన్‌కు ఇక్కడి భూములను అమ్మే హక్కు ఎక్కడిది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేము చేపట్టిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా వదిలేశారు. అలాంటిది ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని ధ్వజమెత్తారు చంద్రబాబు.

Amaravati Buildings : నిన్న భూములు, నేడు భవనాలు.. లీజుకు అమరావతి బిల్డింగ్స్.. సీఎం జగన్ మరో సంచలనం

”ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ డబ్బులు పంచినా ఓట్లను పెంచుకోలేకపోయింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీకి కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదు. అసలు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా ఓట్లు పెరగకపోవడానికి.. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

”అటు పన్నులతో వాతలు.. ఇటు పథకాలకు కోతలు అనేలా జగన్ పాలన సాగుతోంది. పథకాల్లో పలు రకాల నిబంధనలు పెడుతూ కోతలు వేసి డబ్బు మిగుల్చుకుంటున్నారు. అమ్మ ఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గారు. ఒంటరి మహిళల పెన్షన్ వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచి, లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయం” అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.