Amaravati Buildings : నిన్న భూములు, నేడు భవనాలు.. లీజుకు అమరావతి బిల్డింగ్స్.. సీఎం జగన్ మరో సంచలనం

రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణం కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను..

Amaravati Buildings : నిన్న భూములు, నేడు భవనాలు.. లీజుకు అమరావతి బిల్డింగ్స్.. సీఎం జగన్ మరో సంచలనం

Amaravati Buildings

Amaravati Buildings : రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణం కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను లీజుకి ఇవ్వాలని కీలక డెసిషన్ తీసుకుంది. రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్డీఏ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజధాని పరిధిలో పూర్తైన భవనాలను లీజుకివ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది.

Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు

సీఆర్డీఏ ప్రతిపాదలు చేయడం ఆలస్యం.. ఆ వెంటనే.. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఉద్యోగుల వసతి కోసం నిర్మిస్తున్న డి-టైప్ భవనాన్ని లీజుకిచ్చేలా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. భవనాల లీజుకు ప్రభుత్వం ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో.. అప్పుడే.. డి-టైప్ బిల్డింగ్ లోని ఓ టవర్ ను లీజుకు తీసుకునేందుకు విట్ యూనివర్సిటీ ముందుకొచ్చింది.

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

విట్ యాజమాన్యంతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఏడాదికి రూ.8-10 కోట్ల మేర లీజు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సీఆర్డీఏ అధికారులు అంచనా వేశారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్లను లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన డి-టైప్ భవనాలు లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం ఆరు టవర్లతో డి-టైప్ బిల్డింగ్ ల నిర్మాణం జరిగింది. ముందుగా ఓ టవర్ ను సీఆర్డీఏ లీజుకి ఇవ్వనుంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw