Telangana CM : కేసీఆర్‍‍కు యూత్‌‌లో ఫుల్ క్రేజ్ వస్తుంది.. ఏపీలో డబ్బే లేదు

కేసీఆర్ కు యువత నుంచి సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన మొనగాడు లేడని ప్రశంసించారు...

Ex Minister JC Diwakar Reddy : ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాల ప్రకటన ఏనాడూ లేదని.. కేంద్రం కూడా ఇలాంటి ఉద్యోగ ప్రకటన చేయలేదన్నారు. కేసీఆర్ కు యువత నుంచి సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన మొనగాడు లేడని ప్రశంసించారు. 2022, మార్చి 09వ తేదీ బుధవారం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను కలుద్దామని..వెళ్ళినా వీలు కాలేదన్నారు. ఏపీలో అయితే.. మంత్రులకే అపాయింట్ మెంట్ దొరకడం లేదని విమర్శలు చేశారు.

Read More : Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్

ఏపీ రాష్ట్రంలో రాజకీయాలపై జేసీ స్పందించారు. ఏపీ రాష్ట్రంలో జీతాలకే డబ్బులు లేవని, మంత్రి బోత్స ఏపీ రాజధాని హైదరాబాద్ అంటున్నారని, చట్టప్రకారం తమకు రెండేళ్లు హక్కు ఉందని..వచ్చినా రావొచ్చన్నారు. సీఎం జగన్ మూడు రాజధానులను వదిలేసినట్లే..అందుకే బోత్స అలా మాట్లాడారన్నారు. జగన్ కు కాస్త క్రేజ్ తగ్గొచ్చేమో.. కానీ ఓడిపోయేంత కాదన్నారు. చంద్రబాబు వద్ద అంతా భజన బ్యాచ్ చేరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More : అసెంబ్లీ వేదికగా నిరుదోగులకు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.!

గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని..ఇతర అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో… ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని హైదరాబాదేనని వ్యాఖ్యానించారు. దీనిని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయని, ప్రభుత్వం దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమేనన్నారు.

ట్రెండింగ్ వార్తలు