KTR: వీరి ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీపైనే బాధ్యత ఎక్కువ ఉంటుంది: కేటీఆర్

వరి ధాన్యం కొనుగోలులో బోనస్ పై మాట మార్చిన వారిని నిలదీయాలా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR

బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన అద్భుత అవకాశం పెద్దల సభ అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగూడెం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. 5 విభాగాల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల్లో పట్టభద్రుల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీపైనే బాధ్యత ఎక్కువ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ చెప్పారు. అవే హామీలు ఇచ్చి గెలిచిన సీపీఐ తమ హామీలు నిలబెట్టుకున్నాయే లేదో రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్ యువత ఆలోచించాలని అన్నారు. రైతు బంధు 15 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి 10 వేల రూపాయలు ఇవ్వడానికి అనేక కొర్రీలు పెడుతున్నారని చెప్పారు.

వరి ధాన్యం కొనుగోలులో బోనస్ పై మాట మార్చిన వారిని నిలదీయాలా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే కానీ ప్రశంసించే వారు కాదు కాబట్టి ప్రశ్నించే రాకెశ్ రెడ్డిని ఎన్నుకోండని కోరారు. 6 గ్యారెంటీల్లో 5 అమలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాదనపై ప్రజలు ఆలోచించాలని అన్నారు. కొత్తగూడెంను భద్రాద్రి రాముడి పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది కేసీఆర్ అని తెలిపారు.

Also Read: ఆ కారుతో నాకెలాంటి సంబంధం లేదు : ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు