Kodali Nani : వైఎస్ వివేకాను జగన్ ఎందుకు చంపుతారు? వైఎస్ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని చూశారు- కొడాలి నాని

వైఎస్ వివేకాను చంపడం వల్ల పైసా ఆస్తి కూడా సీఎం జగన్ కు కలవలేదన్నారు. వైఎస్ వివేకాను వైఎస్ జగన్ ఎందుకు చంపుతారు? ఏం ప్రయోజనం ఉందని? ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే కుటుంబసభ్యులకు ఏం వస్తుందని నిలదీశారు.

Kodali Nani : వైఎస్ వివేకాను జగన్ ఎందుకు చంపుతారు? వైఎస్ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని చూశారు- కొడాలి నాని

Kodali Nani : వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతిపక్ష టీడీపీపైన, చంద్రబాబు పైన మరోసారి విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలతో ఫైర్ అయ్యారు. టీడీపీ పుస్తకాలు పనికిమాలినవి అని ధ్వజమెత్తారు. “జగనాసుర చరిత్ర” పేరిట టీడీపీ తెచ్చిన పుస్తకాలు చలి మంట వేసుకునేందుకు పనికొస్తాయన్నారు. “తడిగుడ్డతో గొంతు ఎలా కోయాలి” అనే పుస్తకాన్ని టీడీపీ నేతలు రాయాలని ఎద్దేవా చేశారు.

వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వైఎస్ వివేకాను చంపడం వల్ల పైసా ఆస్తి కూడా సీఎం జగన్ కు కలవలేదన్నారు. వైఎస్ వివేకాను వైఎస్ జగన్ ఎందుకు చంపుతారు? ఏం ప్రయోజనం ఉందని? ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే కుటుంబసభ్యులకు ఏం వస్తుందని నిలదీశారు.

Also Read..Chandrababu Naidu : జగన్‌కి ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకా బతికి ఉన్నా కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికే సీఎం జగన్ ఇచ్చేవారని చెప్పారు. కడప ఎంపీ సీటు కోసం వివేకాను ఎందుకు చంపుతారు? అని అడిగారు. వివేకా చనిపోయే నాటికి ఆయన పేరిట ఉన్న ఆస్తులు కూతుళ్లు, అళ్లుళ్లకే దక్కిందన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నందునే గతంలో వివేకా హత్యపై సీబీఐ విచారణ అడిగామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వమే నిస్పక్షపాతంగా విచారణ జరుపుతుందని, అందుకే సీబీఐని వద్దన్నామని కొడాలి నాని వివరించారు.

Also Read..CM Jagan Serious : ఆ 20మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సీరియస్

జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా వివేకా కాంగ్రెస్ లోనే ఉండి వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మను ఓడించేందుకు వివేకా ప్రయత్నించారని అన్నారు. విజయమ్మను ఓడించేందుకు ఆమెపై కాంగ్రెస్ తరపున వివేకా పోటీ చేశారని చెప్పారు.