Nara Lokesh: కోవిడ్ టైంలో బ్రాహ్మణికి దొరికిపోయా.. ఇప్పటికీ కంట్రోల్ తప్పితే మెస్సేజ్ వచ్చినట్లే..

నేను స్లిమ్ గా అవ్వటానికి ప్రధాన కారణం తన సతీమణి బ్రాహ్మిణి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. మీరు స్లిమ్‌గా, ఫిట్‌గా మారడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించగా.. లోకేశ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Nara Lokesh: కోవిడ్ టైంలో బ్రాహ్మణికి దొరికిపోయా.. ఇప్పటికీ కంట్రోల్ తప్పితే మెస్సేజ్ వచ్చినట్లే..

Nara Lokesh

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం ’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం విధితమే. పాదయాత్రలో భాగంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానం చెప్పారు. రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి ఎదురైన ప్రశ్నలకు లోకేశ్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. మంగళగిరిలో ఓటమిపై మాట్లాడుతూ.. మంగళగిరిలో గతంలో టీడీపీ గెలిచిన దాఖలాలు రెండుసార్లేనని, టీడీపీ బలంగాలేని మంగళగిరిలో విజయం సాధించాలన్న పట్టుదలతో అక్కడ నుంచి పోటీ చేశానని లోకేశ్ తెలిపారు.

Nara Lokesh On Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

మొదటి సారి ప్రజల అభిమానాన్ని పూర్తిస్థాయిలో పొందలేక పోయానని, ఫలితంగా ఓటమి చెందానని అన్నారు. అయితే, ఓడిపోయినప్పటికీ.. ఎన్నికల అనంతరం నుంచి మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నానని, 2024లో మంగళగిరిలో టీడీపీ చరిత్ర తిరగరాస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అనంతరం ఓ యువకుడు.. మీరు స్లిమ్ కావడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా.. లోకేశ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నేను కొంచెం ఎక్కువగా తినేవాడినని, ప్రస్తుతం నేను ఇలా స్లిమ్‌గా ఉండటానికి కారణం.. కరోనా టైంలో నా సతీమణి బ్రహ్మణికి దొరికిపోవటమేనని చెప్పారు.

Nara Lokesh Comments YCP : టీడీపీ కార్యాలయంపై దాడి చేసినవారిని కట్ డ్రాయిర్ పై ఊరేగిస్తాను : నారా లోకేశ్

కరోనా సమయంలో బ్రహ్మణి తన డైట్ మొత్తం మార్చేసిందన్న లోకేశ్.. రెండేళ్లు పొద్దున్నే లేపి పరుగెత్తించిందని తెలిపారు. తనకు అందించే ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుందని, నడవడం, వ్యాయామం చేయడం, ఆహారం తీసుకొనే విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వంటి విషయాలపై బ్రహ్మిణి దగ్గరుండి చూసుకుందని లోకేశ్ అన్నారు. బ్రాహ్మిణి నా ఆహారం విషయంలో స్ట్రిక్‌గా ఉండటం వల్ల కొద్దిరోజులకు నాకు ఆ పద్దతి అలవాటైందని అన్నారు. పాదయాత్ర సమయంలో అప్పుడప్పుడు చీటింగ్ చేస్తుంటానని, కొంచెం అతిగా నచ్చిన ఫుడ్ తినేస్తుంటానని, బ్రాహ్మిణికి వెంటనే సమాచారం వెళ్తుందని, కొద్దిసేపటికే నాకు వాట్సాప్ మెస్సేజ్ వస్తుందని లోకేశ్ అన్నారు. ఆ మెస్సేజ్‌లో.. ఈరోజు బాగనే తిన్నావులే.. రేపు తినొద్దు.. చాలా నడవాలని చెబుతుందని లోకేశ్ చెప్పారు.