Nara Lokesh On Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.

Nara Lokesh On Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

Nara Lokesh On Jr NTR : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. అంతేకాదు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వారంతా రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అన్న లోకేశ్ 2014లోనే పవన్ కల్యాణ్ లో మంచి మనసు చూశానన్నారు.

Also Read..Lakshmi Parvathy Comments Over Junior NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..టీడీపీని స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీ పార్వతి

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో భేటీ అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ సూచనలు, సలహాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేశ్. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం తిరుపతి అంకుర ఆసుపత్రి సమీపంలో ‘హలో లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతతో సమావేశమయ్యారు లోకేశ్. యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

Also Read..Lokesh : పెద్ద వివాదంగా మారిన ఫారిన్ ఫోటోపై స్పందించిన లోకేష్.. ఎన్ని ట్రోల్స్ చేసినా..

మీరు ఎవరి ఫ్యాన్ అని కొందరు అడగగా.. తాను మెగాస్టార్ అభిమానినని బదులిచ్చారు లోకేశ్. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమా చూశానని చెప్పారు. అయితే, బాలయ్య ఎంతైనా తన ముద్దుల మామయ్య అని, ఆయనను విశేషంగా అభిమానిస్తానని తెలిపారు. బాలా మామయ్య అన్ స్టాపబుల్ అని కొనియాడారు. ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షోకు మొదట ఉండేది తానేనని లోకేశ్ వివరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

‘జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని నన్ను అడిగారు. నూటికి నూరు శాతం ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి, అందరూ గర్వ పడే విధంగా ఏపీ ఉండాలి అని ఆశిస్తారో.. వారంతా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో ముందుగా అవసరమైనది మంచి మనసు. ఆ మంచి మనసు ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించొచ్చు’ అని లోకేశ్ అన్నారు.