Lokesh : పెద్ద వివాదంగా మారిన ఫారిన్ ఫోటోపై స్పందించిన లోకేష్.. ఎన్ని ట్రోల్స్ చేసినా..

లోకేష్ సమాధానమిస్తూ.. అది 2006లో జరిగింది. కాలేజీలో ఎంజాయ్ చేశాం చివరి రోజు. వాళ్లంతా నా ఫ్రెండ్స్, బ్రాహ్మణికి కూడా ఫ్రెండ్స్. నాకంటే బ్రాహ్మణితోనే ఎక్కువ టచ్ లో ఉంటారు. కాలేజీ టైములో సరదాగా ఎంజాయ్ చేశాము మీలాగే. ఆ ఫోటో గురించి ఇంకా ఎవరన్నా మాట్లాడితే...............

Lokesh : పెద్ద వివాదంగా మారిన ఫారిన్ ఫోటోపై స్పందించిన లోకేష్.. ఎన్ని ట్రోల్స్ చేసినా..

Lokesh reaction on Foreign photo

Lokesh :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. అలాగే లోకేష్ కూడా రావడంతో లోకేష్ కి సంబంధించిన పలు విషయాలని కూడా ప్రస్తావించారు బాలకృష్ణ. గతంలో లోకేష్ యూరప్ లో చదువుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఓ ఫోటో రాజకీయాల్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోతో లోకేష్ పై ప్రత్యర్ధ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. తాజాగా ఆ ఫోటోని అన్‌స్టాపబుల్‌ షోలో ప్రదర్శించి అది అసెంబ్లీ దాకా వెళ్ళింది అని బాలకృష్ణ దాని గురించి మాట్లాడటం విశేషం.

దానికి లోకేష్ సమాధానమిస్తూ.. అది 2006లో జరిగింది. కాలేజీలో ఎంజాయ్ చేశాం చివరి రోజు. వాళ్లంతా నా ఫ్రెండ్స్, బ్రాహ్మణికి కూడా ఫ్రెండ్స్. నాకంటే బ్రాహ్మణితోనే ఎక్కువ టచ్ లో ఉంటారు. కాలేజీ టైములో సరదాగా ఎంజాయ్ చేశాము మీలాగే. ఆ ఫోటో గురించి ఇంకా ఎవరన్నా మాట్లాడితే చెప్పండి నేనే ఫ్రేమ్ కట్టించి మరీ పంపిస్తాను అని అన్నారు. ఈ ఫోటో మీద మీ స్పందన ఏంటి అని చంద్రబాబుని బాలకృష్ణ అడగగా.. మామకి లేని సందేహం నాకెందుకు అని చెప్పారు.

Chandrababu : నారా ఫ్యామిలీ బ్రాహ్మణి చేతుల్లో సేఫ్ గా ఉంది.. భార్యకి ఫోన్ చేసి లవ్ యు చెప్పిన చంద్రబాబు

ఇక లోకేష్ మీద అనేక ట్రోల్స్ వస్తూ ఉంటాయి దానిపై ఏమంటావు అని బాలకృష్ణ అడగగా లోకేష్.. మన మీద రకరకాల ట్రోల్స్ ఉన్నాయి ఏంటి అంటే మనం బలంగా ఉన్నాం కాబట్టే ట్రోల్స్ చేస్తారు. మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మి ముందుకెళ్తున్నాం. ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రోల్స్ పట్టించుకుంటే ముందుకెళ్ళలేము. మా నాన్నకి, అమ్మకి, బ్రాహ్మణికి సందేహం లేనప్పుడు నేను ఎవర్ని పట్టించుకోను. చేసుకుంటే చేసుకోండి ట్రోల్స్ అని ట్రోల్స్ చేసేవాళ్ళకి కౌంటర్ ఇచ్చారు.