Chandrababu : నారా ఫ్యామిలీ బ్రాహ్మణి చేతుల్లో సేఫ్ గా ఉంది.. భార్యకి ఫోన్ చేసి లవ్ యు చెప్పిన చంద్రబాబు

చంద్రబాబు బ్రాహ్మణి గురించి మాట్లాడుతూ.. నారా ఫ్యామిలీ బ్రాహ్మణి చేతుల్లో సేఫ్ గా ఉంది. బ్రాహ్మణి నా కోడలు కావడం నాకు గర్వకారణం. తను చాలా తెలివిగలది. మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు.............

Chandrababu : నారా ఫ్యామిలీ బ్రాహ్మణి చేతుల్లో సేఫ్ గా ఉంది.. భార్యకి ఫోన్ చేసి లవ్ యు చెప్పిన చంద్రబాబు

Chandrababu praise his daughter in law brahmani

Chandrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. కుటుంబ విషయాలు కూడా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ గేమ్ ఆడుతూ చంద్రబాబుని బ్రాహ్మణికి, భువనేశ్వరికి కాల్ చేసి మాట్లాడమన్నారు.

దీంతో మొదట చంద్రబాబు బ్రాహ్మణి గురించి మాట్లాడుతూ.. నారా ఫ్యామిలీ బ్రాహ్మణి చేతుల్లో సేఫ్ గా ఉంది. బ్రాహ్మణి నా కోడలు కావడం నాకు గర్వకారణం. తను చాలా తెలివిగలది. మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పారు. ఇక కాల్ చేశాక బాలయ్య నేను బ్రాహ్మణికి మాత్రమే భయపడతాను అని చెప్తే నాన్న నా మాట వింటారు, నేను నాన్న మాట వింటాను. నాన్న అన్‌స్టాపబుల్‌ మాత్రమే కాదు అన్‌ కంట్రోలబుల్ కూడా అని బ్రాహ్మణి చెప్పింది.

Chandrababu Naidu : నాది, ఎన్టీఆర్‌ది రామాంజనేయ యుద్ధం.. వివాదాస్పద ఎన్టీఆర్ ఇష్యూపై మాట్లాడిన చంద్రబాబు..

ఇక చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి కాల్ చేసి.. భువ్ అని పిలిచి మాట్లాడారు. మీ అల్లరి అన్నయ్య దగ్గర ఉన్నాను అంటే ఇంకా షో అవ్వలేదా అని అడిగింది. బాలయ్య ఐ లవ్ యు చెప్పమంటే చంద్రబాబు ఐ లైక్ యు అని చెప్పారు. లవ్ లైఫ్ లో లైక్ ఉంటుంది అని చంద్రబాబు అనడంతో.. ఫోన్ లో భువనేశ్వరి.. ఏంటి సడెన్ గా ఈ లవ్ డైలాగ్స్ అనడంతో సైలెంట్ గా ఉండు భువ్ మీ అన్నయ్య చేతిలో ఇరుక్కుపోయాను స్టేజి మీద ఉన్నాను, స్పీకర్ లో ఉంది అని చెప్పారు. చివరగా నీ సహకారం లేకుంటే నేను ఇంత రేంజ్ కి వచ్చేవాడిని కాదు అని థ్యాంక్స్ చెప్పారు.