Lakshmi Parvathy Comments Over Junior NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..టీడీపీని స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీ పార్వతి

 జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారిలో తాను మొదటి మనిషినని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.

Lakshmi Parvathy Comments Over Junior NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..టీడీపీని స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathy comments over Junior NTR

Updated On : August 24, 2022 / 4:51 PM IST

Lakshmi Parvathy Comments Over Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారిలో తాను మొదటి మనిషినని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.

తిరుపతిలో ఇవాళ తెలుగు అకాడమీ వ్యవహారాలపై ప్రెస్ మీట్ నిర్వహించిన లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీపై మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. అయితే రేపు దీనిపై స్పందిస్తానని చెప్పినా.. మీడియా ప్రతినిధులు ఆమెను వదల్లేదు. దీంతో ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మీపార్వతి స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వాళ్లలో తాను కూడా ఉన్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలోనూ లక్ష్మీపార్వతి పలుమార్లు చెప్పారు.

Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దీనిపైన కూడా లక్ష్మీపార్వతి స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే టీడీపీని తీసుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయనకు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీలో ఏం జరిగిందనే అంశంపై మాట్లాడేందుకు మాత్రం లక్ష్మీపార్వతి నిరాకరించారు. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తనను అడిగేతే ఏం చెప్తానని అన్నారు.