Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి

టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీరుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి

Laxmi Parvati

Lakshmi Parvati criticized : టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీరుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎన్టీఆర్ కు గుండెపోటు రావడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. మీ నాన్నగారి మీద మీకు ప్రేమ లేదా.. అని బాలకృష్ణను ప్రశ్నించారు. చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తున్నారని… నమ్మవద్దని నందమూరికి ఫ్యామిలీకి చెప్పారు. ఇవాళ నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. వైసీపీ నాయకులు రాజకీయ విమర్శలు చేసివుంటారు..కానీ ఎనాడైనా ఆడవారి జోలికి వెళ్లారా అని బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడారు.

తెలుగు వాడు, తెలుగు జాతి అంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు వస్తుందన్నారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు తనకు ఫోన్ చేసి చాలా డబ్బు ఇస్తాను…విదేశాల్లో మీ అబ్బాయిని చదివించుకుని..అక్కడ సెటిల్ అవ్వండి…మీరు వెళ్లిపోండి..మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని ఫోన్ చేసి చెప్పాడో లేదో చంద్రబాబును అడగమని బాలకృష్ణకు తెలిపారు. మీ నాన్న విషయంలో మీకు ఒక్క నిజం కూడా చెప్పలేదన్నారు. తనపై చంద్రబాబు ధ్వేషాన్ని కలగజేశాడని తెలిపారు. చంద్రబాబు మీద పోరాటం చేయడానికే వైసీపీలోకి వెళ్లానని..పదవుల కోసం కాదన్నారు.

Pakistan : అత్యాచార చట్టం..పాక్ యూ టర్న్, కెమికల్ క్యాస్ట్రేషన్ తొలగింపు!

చంద్రబాబు భోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..తమను ఘోరంగా అవమానిస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా బండబూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెక్కివెక్కి ఏడ్చారు. కొద్దిసేపటి అనంతరం ఆయన మళ్లీ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అన్ని విధాల అవమానిస్తోంది.. వ్యక్తిగత విమర్శలు చేశారు..ఎన్నో అవమానాలు భరించామన్నారు. చివరకు తన భార్యను కూడా అవమానిస్తున్నారని, నా భార్య కూడా ఎంతో సహకరించిందని తెలిపారు.

శుక్రవారం (నవంబర్ 19)న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికారపక్షం, విపక్ష సభ్యుల మధ్య మాటలతూటాలు పేలాయి. ఈ సందర్భంగా చంద్రబాబు సభలో జరిగిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే..సభలో అడుగుపెడుతానని శపథం చేసి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టారు.