Pakistan : అత్యాచార చట్టం..పాక్ యూ టర్న్, కెమికల్ క్యాస్ట్రేషన్ తొలగింపు!

మెడికల్ బోర్డు సూచనల ప్రకారం వ్యక్తి శరీరంలోకి రసాయనం ఎక్కిస్తారు. దీంతో ఆ వ్యక్తి లైంగికంగా పనికిరాకుండా పోతాడు.

Pakistan : అత్యాచార చట్టం..పాక్ యూ టర్న్, కెమికల్ క్యాస్ట్రేషన్ తొలగింపు!

Pak

Castration Clause : అత్యాచార కేసుల్లో లైంగిక సామర్థ్యం లేకుండా చేసే ‘ద క్రిమినల్ లా బిల్లు -2021’ పాకిస్తాన్ యూ టర్న్ తీసుకుంది. ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్ కౌన్సిల్ స్పష్టం చేసింది. దీంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కెమికల్ క్యాస్ట్రేషన్ క్లాజ్ ను తొలగిస్తున్నట్లు పార్లమెంటరీ న్యాయ కార్యదర్శి జస్టిస్ మలీకా బొకారీ వెల్లడించారు. అయితే.. ఈ విషయంలో చర్చలు జరిగాయని, న్యాయశాఖ మంత్రి ఫరోగ్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయన్నారు. అనంతరం కెమికల్ క్యాస్ట్రేషన్ అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన రెండు రోజులకే వెనక్కి అడుగు వేయడం గమనార్హం. రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించడం సరికాదని జమాత్ ఎ ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read More : Mahabubnagar : స్కూటీపై వెళుతుండగా..గుండెపోటు, కుప్పకూలిన యువకుడు, వీడియో వైరల్

అత్యాచారాలు అధికం అవుతుండడంతో పాక్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకరావాలని భావించింది. రేప్ చేయాలంటే భయపడేలా ఓ చట్టాన్ని తయారు చేసింది. అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలక నేరచట్టం-2021 బిల్లుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అత్యాచారాలను కట్టడి చేసేందుకు దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read More : Navjot Sidhu : మరో వివాదంలో సిద్ధూ..పాకిస్తాన్ వెళ్లి ఇమ్రాన్ ఖాన్ ను “పెద్దన్న”గా సంబోధించడంపై దుమారం

గతేడాదే ఈ బిల్లుకు పాక్ కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్టు నిబంధనలు, మెడికల్ బోర్డు సూచనల ప్రకారం వ్యక్తి శరీరంలోకి రసాయనం ఎక్కిస్తారు. దీంతో ఆ వ్యక్తి లైంగికంగా పనికిరాకుండా పోతాడు. అత్యాచార కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే ప్రక్రియను కెమికల్ కాస్ట్రేషన్‌గా పిలుస్తారు. ఈ ప్రక్రియ కోసం డాక్టర్లు డ్రగ్స్ ఉపయోగించి దోషులు శృంగారం చేయడానికి పనికిరాకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ శిక్షలను అమలు చేస్తున్నారు.