Vivo V50 5G : ఇది కదా డిస్కౌంట్.. కొత్త వివో V50 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!
Vivo V50 5G : వివో అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. వివో V50 5జీ స్మార్ట్‌ఫోన్ ఏకంగా రూ. 7వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ ఆఫర్ మీకోసమే..

Vivo V50 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V50 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సూపర్ డీల్స్‌లో రూ. 7వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్లూ వోల్ట్ లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. 90W ఫ్లాష్ ఛార్జ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. 4K రిజల్యూషన్ వరకు రికార్డ్ 50MP మెయిన్ సోనీ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లోపల పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ కూడా పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ఫొటోగ్రఫీ ప్రియులకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే కస్టమర్‌లకు అద్భుతంగా ఉంటుంది.

వివో V50పై రూ. 7వేలు డిస్కౌంట్ : వివో V50 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999కి లాంచ్ అయింది. కానీ, 17శాతం డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 32,999కి పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌పై ఫోన్‌కు 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మీరు రూ. 32,310 వరకు తగ్గింపు పొందవచ్చు. కానీ, మీ ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, అసలు ధర, బ్రాండ్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.

డిస్‌ప్లే, డిజైన్ : వివో V50 5G స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ FHD ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, స్టార్రి నైట్ రోజ్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. బ్యాక్ గ్లాస్ ప్యానెల్‌లో 3D స్టార్ టెక్నాలజీని కలిగి ఉంది.

కెమెరా సెటప్ : వివో V50 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. 50MP సోనీ మెయిన్ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ లభిస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్‌తో 50MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. మెరుగైన లో-లైటింగ్ ఫొటోగ్రఫీ కోసం అడ్జెస్ట్ టెంపరేచర్‌తో ఆరా లైట్ కూడా ఉంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలలో 4K రిజల్యూషన్ వరకు రికార్డ్ చేయవచ్చు.

బ్యాటరీ ప్యాక్ : వివో V50 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ ప్యాక్‌తో 2 రోజుల వరకు లాంగ్ టైమ్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అంతేకాదు.. బాక్స్‌లో చేర్చిన అడాప్టర్‌తో 90W ఫ్లాష్ ఛార్జ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ లేదా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వదు.

డిస్‌ప్లే, ప్రాసెసర్ : వివో V50 5G స్మార్ట్‌ఫోన్ గేమర్‌లకు అద్భుతంగా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ మల్టీ టాస్కింగ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ వివో ఫోన్ 8GB, 12GB LPDDR4X ర్యామ్ వంటి మల్టీ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఇందులో 128GB నుంచి 512GB UFS 2.2 వరకు స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. కాల్ ట్రాన్స్‌లేషన్ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ వంటి ఏఐ అప్‌గ్రేడ్స్ కూడా కలిగి ఉంటుంది.
