IND A vs SA A : ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..
దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో (IND A vs SA A) వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాల మోత మోగించాడు ధ్రువ్ జురెల్.
IND A vs SA A Dhruv Jurel century south africa target is 416
IND A vs SA A : టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో (IND A vs SA A) వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులతో అజేయంగా నిలిచిన ధ్రువ్ జురెల్, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో భారత్-ఏ జట్టు 7 వికెట్ల నష్టానికి 382 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా-ఏ ముందు 416 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా-ఏ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్ (15), లెసెగో సెనోక్వానే (9) లు క్రీజులో ఉన్నారు. సఫారీ విజయానికి ఇంకా 392 పరుగులు అవసరం.
ఈ మ్యాచ్‌లో భారత్-ఏ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. ఆ తరువాత దక్షిణాప్రికా-ఏ 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 34 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తరువాత ధ్రువ్ జురెల్ అజేయ శతకానికి తోడు కెప్టెన్ రిషబ్ పంత్ (65), హర్ష్ దూబె (84) అర్థశతకాలతో రాణించడంతో దక్షిణాఫ్రికా-ఏ ముందు భారత్-ఏ భారీ లక్ష్యాన్ని ఉంచింది.
