Jagga Reddy: రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500..! ఎప్పటి నుంచి అంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

రెండేళ్లు అయిపోయాయి. ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మిగిలిన పథకాలు అమలు చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు.

Jagga Reddy: రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500..! ఎప్పటి నుంచి అంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Updated On : November 8, 2025 / 6:32 PM IST

Jagga Reddy: అధికార పార్టీ కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. స్థానిక నేత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు జగ్గారెడ్డి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా జగ్గారెడ్డి ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ఎన్నికల హామీలపై జగ్గారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వృద్ధులకు 4వేల పెన్షన్, మహిళలకు 2వేల 500 రూపాయల సాయం పథకాల అమలుపై జగ్గారెడ్డి స్పందించారు. త్వరలోనే ఈ పథకాలు అమలవుతాయని చెప్పారు. వీటి అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. వీటి అమలుకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుందన్నారు.

”వృద్ధులకు 4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం గురించి సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఈ హామీల హామీలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. 4వేల పెన్షన్ ఇచ్చేందుకు త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల అమలుకు బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 4వేల పెన్షన్, మహిళలకు 2వేల 500 సాయం కానివ్వండి.. వీటిని త్వరలో అమలు చేస్తారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నాం.

ఏదీ చెయ్యలేదు అని అనడానికి లేదు. అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. బడ్జెట్ గురించి అందరికీ తెలుసు. పైసలు ఉన్నాయా లేవా అన్నది ప్రజలకు తెలుసు. రెండేళ్లు అయిపోయాయి. ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మిగిలిన పథకాలు అమలు చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఓపిక పట్టండి. అవి కూడా అమలవుతాయి” అని జగ్గారెడ్డి అన్నారు.

జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం..

”అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. సీఎం ద్వారా జూబ్లీహిల్స్ పనులను నవీన్ యాదవ్ చేయించగలరు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడే పుట్టి పెరిగాడు. శక్తి, యుక్తి కలిగిన నాయకుడు. ఉపఎన్నికలో కాంగ్రెస్ ను జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించాలి. వచ్చే ఐదేళ్లు కూడా ప్రజలు కాంగ్రెస్ కే అవకాశం ఇస్తారు. ప్రతిపక్ష నేత గెలిస్తే అభివృద్ధికి అవకాశాలు తక్కువ. ప్రజలు నవీన్ యాదవ్ ను గెలిపిస్తారనే విశ్వాసం మాకుంది. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి నాదీ బాధ్యత.

మంచి అవకాశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు వదులుకోవద్దు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పెండింగ్ నిధులు ఇప్పించే బాధ్యత కూడా నాదే. రూలింగ్ పార్టీ నేత గెలిస్తే లాభం, అపోజిషన్ పార్టీ నేత గెలిస్తే లాభమేమీ ఉండదు. రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2500 సాయం ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారు. మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మరో ఐదేళ్లు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆశిస్తున్నాం” అని జగ్గారెడ్డి అన్నారు.

Also Read: ఆలయాల కూల్చివేత.. రగిలిపోతున్న రామగుండం.. 48 గంటలు టైమ్‌ ఇచ్చిన బండి సంజయ్‌