Google Pixel 8 : బిగ్ డిస్కౌంట్.. అతి చౌకైన ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్.. ఈ క్రేజీ ఆఫర్ డోంట్ మిస్!
Google Pixel 8 : గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఈ పిక్సెల్ 8 కొనుగోలుపై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 8 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన డిస్కౌంట్.. కెమెరా-సెంట్రిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 8 ధర భారీగా తగ్గింది. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుంచి డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా తక్కువ ధరకు ఈ ప్రీమియం పిక్సెల్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 8 సేల్ ధర, డిస్కౌంట్ ఆఫర్లు : గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ (Obsidian) ధర రూ.75,999కు పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి 37శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత పిక్సెల్ 8 ఫోన్ ధర రూ.47,999 అవుతుంది. ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో రూ. 2,400 తగ్గింపు పొందవచ్చు. తద్వారా భారీగా ధర తగ్గింపు పొందవచ్చు.

ఈఎంఐ ఆప్షన్ : మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 46,810 డిస్కౌంట్ పొందవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ కలిగి ఉండాలి. లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి. మీరు రూ. 1,635 ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే క్వాలిటీ : ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ 6.2-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ కలిగి ఉంది.

డిస్‌ప్లే : స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరాలు : కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అయితే, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా కలిగి ఉంది.

బ్యాటరీ లైఫ్ : ఈ గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ 4575mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. IP68 రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది.
