IND vs AUS : టీమ్ఇండియాదే టీ20 సిరీస్‌.. వ‌ర్షం కార‌ణంగా ఐదో టీ20 మ్యాచ్ ర‌ద్దు..

IND vs AUS : అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఐదో టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది.

IND vs AUS : టీమ్ఇండియాదే టీ20 సిరీస్‌.. వ‌ర్షం కార‌ణంగా ఐదో టీ20 మ్యాచ్ ర‌ద్దు..

IND vs AUS 5th match abandoned due to rain

Updated On : November 8, 2025 / 4:41 PM IST

IND vs AUS : అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఐదో టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ 2-1 తేడాతో కైవ‌సం చేసుకుంది.

శ‌నివారం బ్రిస్బేన్ లోని గ‌బ్బా వేదిక‌గా భార‌త్, ఆసీస్ జ‌ట్లు ఐదో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ (29 నాటౌట్; 16 బంతుల్లో 6 ఫోర్లు), అభిషేక్ శ‌ర్మ (23 నాటౌట్; 13 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు.

Abhishek Sharma : చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

అయితే.. వారి విధ్వంసానికి వ‌రుణుడు బ్రేకులు వేశాడు. 4.5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 52 ప‌రుగులుగా ఉండ‌గా వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. ఎంత‌సేప‌టికి కూడా వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.

ఇక ఈ సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్ కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే. రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ గెల‌వ‌గా, మూడు, నాలుగో టీ20 మ్యాచ్‌ల్లో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ భార‌త్ సొంత‌మైంది.