Visakha : నాగుల చవితి వేడుకల్లో అపశ్రుతి.. ఒకరు మృతి

విశాఖజిల్లా యలమంచిలిలో జరిగిన నాగుల చవితి వేడుకలో విషాదం జరిగింది. నెల వేశాల కార్యక్రమంలో అపసృతి చోటుచేసుకుంది.

Visakha :  నాగుల చవితి వేడుకల్లో అపశ్రుతి.. ఒకరు మృతి

Visakha

Visakha :  విశాఖజిల్లా యలమంచిలిలో జరిగిన నాగుల చవితి వేడుకలో విషాదం జరిగింది. నెల వేశాల కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకొని ఫైర్ చేస్తుండగా మంట ఒక్కసారిగా అంటుకుంది.

చదవండి : Visakhapatnam : సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఈ ప్రమాదంలో సంతోష్ నోటిభాగం పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పిన స్థానికులు ఆయనకు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంతోష్ మృతితో యలమంచిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Visakha Airport: విశాఖ విమానాశ్రయంలో హై టెన్షన్