Visakhapatnam : సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

విశాఖ పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజ్‌ కారణంగా 2వ యూనిట్‌ ఆగిపోయింది. 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

Visakhapatnam : సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

Ntpc

Stopped power generation : ఏపీలో విద్యుత్‌ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుతోంది. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కొరతకు తోడు.. సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. విశాఖ జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజ్‌ కారణంగా 2వ యూనిట్‌ ఆగిపోయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం. కానీ.. కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదు.. అంతా ఓకే అంటోంది. మరి.. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవ పరిస్థితేంటి?

Coal Crisis AP : ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే

రాష్ట్ర ప్రజలారా.. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే.. కరెంటు కోతలు మొదలయ్యాయి. భవిష్యత్తుల్లో మరిన్ని కోతలు తప్పేలా కనిపించడం లేదు. త్వరలోనే.. కరెంటు కొరత రావొచ్చు. ఎందుకంటే.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దేశీయంగా బొగ్గు నిల్వలు పడిపోవటం, యూనిట్ ఛార్జీలు పెరగడంతో.. కరెంటు సమస్య తలెత్తింది. ఎంత డబ్బు పెట్టినా.. కొరత తీర్చలేని పరిస్థితి నెలకొంది. అందుకే.. ఇప్పటి నుంచే విద్యుత్‌ను పొదుపుగా వాడుకోండి. ఇప్పటికే.. ఏసీల వినియోగాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ కూడా సూచించింది.

ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉందని.. సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంట్ కోతలు అమలు చేయాల్సి రావొచ్చని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం చెప్పారు. దేశంలో బొగ్గు కొరతే లేదని, విద్యుత్‌ సంక్షోభం అసలే లేదంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటనను సజ్జల ఖండించి.. అసలు విషయాలు బయటపెట్టారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏపీలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. బొగ్గు కొరతతో పాటు, విద్యుత్ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయి. కొనుగోలు చేద్దామన్నా.. బొగ్గు దొరకడం లేదు. అటు ఎక్సేంజ్‌లోను పీక్‌.. ఆఫ్‌ పీక్‌ టైమ్‌తో సంబంధం లేకుండా యూనిట్ ధర 20 రూపాయలు పలుకుతోంది. ఇంత ధరకు కరెంటు కొని ఇవ్వడం విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇళ్లలో కరెంటు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రాబోయే అయిదారు నెలలు.. ప్రజలు విద్యుత్ ఆదా చేయాలని సూచిస్తోంది.