Seetha Payanam OTT: ఓటీటీలో అర్జున్ కూతురు నటించిన ‘సీతా పయనం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఉగాది కానుకగా ఓటీటీకి రానున్న లేటెస్ట్ ఎమోషనల్ మూవీ సీతా పయనం(Seetha Payanam OTT).
Arjun sarja Seetha payanam ott streaming update
Seetha Payanam OTT: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీతా పయనం(Seetha Payanam OTT)’. ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య సర్జా టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయం కాగా, కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను సాధించలేకపోయిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించేందుకు రెడీ అయ్యింది.
Dhurandhar 2: ధురంధర్ 2 ఫ్యాన్స్ కి షాక్.. ప్రీమియర్ షోస్ క్యాన్సిల్
తాజా సమాచారం ప్రకారం, ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్స్ట్’ (SunNxt)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, సున్నితమైన ప్రేమకథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే వీక్షించవచ్చు. విజువల్స్, సంగీతం పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, డిజిటల్ వేదికపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
