YS Viveka Case : ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు.. నేరం రుజువైతే నాతో పాటు మరో 9మంది రాజీనామా : వైసీపీ ఎమ్మెల్యే

YS వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేరస్తుడిగా రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇక రాజకీయాల్లో ఉండను. నాతో పాటు మరో తొమ్మిదిమందిని రాజీనామా.

YS Viveka Case : ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు.. నేరం రుజువైతే నాతో పాటు మరో 9మంది రాజీనామా : వైసీపీ ఎమ్మెల్యే

MLA Rachamallu Sivaprasad Reddy

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన షాకుతో ఇక తన అరెస్ట్ తప్పదనే భావనకు ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో అవినాశ్ అరెస్ట్ పై ప్రొద్దుటూరు YCP  ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్నారు శివప్రసాద్ రెడ్డి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే బెయిల్ పై బయటకు వస్తాడని ఈ హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేరస్తుడిగా రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని..అవినాష్ రెడ్డి హత్య చేశాడని రుజువైతే ఇక రాజకీయాల్లో ఉండనని, నాతో పాటు మరో తొమ్మిదిమందిని రాజీనామా చేయమని చెప్పాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Viveka Case : అరెస్టుకా? విచారణకా? పులివెందుల ఇంటిలో అవినాశ్ రెడ్డి.. ఊరి వెలుపల కాపు కాసిన సీబీఐ..

అవినాష్ రెడ్డిని అనవసరంగా కేసులో ఇరికించారని..అరెస్ట్ అయినంత మాత్రాన నేరం చేసినట్లుగా కాదన్నారు శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు వెనకుండి ఈ కేసులో కుట్ర చేసి అవినాష్ ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించాడని సాక్షిగా నమ్ముతున్నానని మొదటి నుంచి నేను ఇదే చెబుతున్నా..నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే తన రాజీనామా గురించి క్లారిటీ ఇస్తు ముద్దాయిని చేస్తే రాజీనామా చేస్తామని చెప్పలేదు.. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేరస్తుడిగా రుజువు అయితే రాజీనామా చేస్తాను అన్నానని వివరించారు శివప్రసాద్ రెడ్డి. న్యాయస్థానంలో అవినాశ్ రెడ్డి నేరస్థుడిగా రుజువైతే రాజీనామా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాను అంటూ స్పష్టం చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

YS Viveka Case : తప్పు చేశారు ఇక తప్పించుకోలేరు, అరెస్ట్ ఈ రోజో రేపో.. సిద్ధంగా ఉండు.. : బీటెక్ రవి