YS Viveka Case : తప్పు చేశారు ఇక తప్పించుకోలేరు, అరెస్ట్ ఈ రోజో రేపో.. సిద్ధంగా ఉండు.. : బీటెక్ రవి

వివేకా హత్య కేసులో ఏ ఎంపీ జోలికి వెళ్లని సీబీఐ కేవలం అవినాష్ వద్దకే ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాలన్నారు బీటెక్ రవి. వివేకా కేసులో ఎవరినీ ఎవరూ ఇబ్బంది పెట్టేది లేదని..అరెస్ట్ కు రెడీగా ఉండు అన్నారు.

YS Viveka Case : తప్పు చేశారు ఇక తప్పించుకోలేరు, అరెస్ట్ ఈ రోజో రేపో.. సిద్ధంగా ఉండు.. : బీటెక్ రవి

BTech Ravi ..Avinash Reddy

YS Viveka Case : ఎంపీ అవినాష్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి. ఎంపీనైనా నాకే సీబీఐ ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తుందని ఎంపీ అవినాష్ వాఖ్యానించడం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో చాలామంది ఎంపీలున్నారు. కానీ వివేకా హత్య కేసులో ఏ ఎంపీ జోలికి వెళ్లని సీబీఐ కేవలం అవినాష్ వద్దకే ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాలని అన్నారు. వివేకా కేసులో ఎవరినీ ఎవరూ ఇబ్బంది పెట్టేది లేదని టీడీపీపై లేని పోని నిందలు వేసి రాజకీయ లబ్ది పొందినవారంతా తగిన శిక్ష అనుభవించాల్సిందేనన్నారు బీటెక్ రవి.

రాష్ట్రంలో ఉన్న ఇంతమంది ఎంపీల జోలికి వెళ్ళని సీబీఐ మీ దగ్గరికి వస్తుందంటే హత్యతో సంబంధం ఉంది కాబట్టే..సీబీఐ విచారణ చేస్తోందని ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించకుండా ఎంపీ అయినంతమాత్రాన సీబీఐ ఏమీ చేయదనే ఆలోచనల చుట్టే తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీపై అత్యంత దారుణంగా ఆరోపణలు చేసిన విషయాన్ని అవినాశ్ రెడ్డి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. నేనే వివేకాను హత్య చేశారని కూడా ఆరోపణలు చేశారని అప్పుడు ఏమయ్యాయి పరిస్థితి తలమీదకు వచ్చాక ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారని, ధైర్యంగా ఉండాలని ప్రజలకు చెప్పుకోవడానికే పులివెందుల వచ్చారని కానీ అన్యాయంగా సీబీఐ విచారణ ఎందుకు చేస్తుంది?అనే విషయం ప్రజలకు బాగా అర్థమైందన్నారు.

YS Viveka Case : ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు.. నేరం రుజువైతే నాతో పాటు మరో 9మంది రాజీనామా : వైసీపీ ఎమ్మెల్యే

నన్ను ఈ హత్య కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని చెప్పినంతమాత్రాన ప్రజలు నమ్మరని పులివెందుల ప్రజలు అంత అమాయకులు కాదన్నారు.సమయం వస్తే అన్ని బయటపడతాయని జగన్, అవినాష్ కు బుద్ధి చెప్పేందుకు పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అవినాష్ కేసు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా, తీసుకోకపోయినా సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది..సీరియస్ గా జరిగే పరిస్థితి ఇదేనన్నారు బీటెక్ రవి.

అరెస్ట్ ఈ రోజో రేపో.. జరిగి తీరుతుంది. అరెస్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉండు సిద్ధం లేకపోయినా సీబీఐ అరెస్ట్ చేయటం ఖాయమని స్పష్టంచేశారు. వివేకా హత్య కేసులో న్యాయం, ధర్మం గెలవాలని అందరు కోరుకుంటున్నారని..చివరకు నూటికి నూరు శాతం సునీతకు న్యాయం జరుగుతుంది..అని అన్నారు. ఈకేసులో అవినాశ్ రెడ్డి తప్పించుకోవటానికి ఇక ఏమాత్రం ఛాన్స్ లేదని కానీ ఇంకా నీచరాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రోద్దుటూరులో సునీత రంగ ప్రవేశం అంటే వెలసిన పోస్టర్లు వైసీపీ నేతల కుట్రేనని తేల్చి చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..రానున్న ఎన్నికలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బీటెక్ రవి.