Paritala Sriram : వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుడి గుడిసె కూల్చేస్తారా..? మా ప్రభుత్వం వచ్చాక మీ ఇంట్లోంచి రోడ్లు వేస్తాం జాగ్రత్త..

ఒక వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుని గుడిసెను కూల్చివేస్తున్నారని టీడీపీ నేతల పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పోట్లమర్రి గ్రామంలో వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Paritala Sriram : వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుడి గుడిసె కూల్చేస్తారా..? మా ప్రభుత్వం వచ్చాక మీ ఇంట్లోంచి రోడ్లు వేస్తాం జాగ్రత్త..

Paritala Sriram.. kethireddy

Paritala Sriram : గ్రామాల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోతోందని..పొట్లమర్రి గ్రామంలో ఒక వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుని గుడిసెను కూల్చివేస్తున్నారని టీడీపీ నేతల పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పోట్లమర్రి గ్రామంలో వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని అధికారాన్ని అడ్డంపెట్టుకుని అమాయకులపై తమ ప్రతాపాన్ని చూపెడతున్నారని వారి అధికార మదానికి ఓ అమాయకుడు నివసాన్ని కూల్చివేశారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైసీపీ నాయకులకు భయపడి అధికారులు కూడా అన్యాయాలకు బలైపోతున్న అమాయకులను పట్టించుకోవటంలేదని ఫిర్యాదు చేసినా వైసీపీ నాయకులను ప్రశ్నించే పరిస్థితిలేదన్నారు. ఇలా అధికారం ఉందనే అహకారంతో అమాయకుల ఇళ్లను కూల్చివేయటం దారుణమని అన్నారు. ఓ అమాయకుడు నివసిస్తున్న చిన్న గుడిసెను కూడా కూల్చేసే దారుణాలకు వైసీపీ నాయకులు పాల్పడుతుంటే న్యాయం చేయాలని రెవెన్యూ అధికారి వద్దకు వెళ్తే వైసీపీ నాయకులకు వంత పాడుతున్నారని ఇదేనా న్యాయం ఇదే సుపరిపాలన అను చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం గొప్పతనం అంటూ విమర్శించారు.

Paritala Sriram : గుర్రాల కోట కేతిరెడ్డీ కూల్‌గా ఉంటే నీకే మంచిది: వైసీపీ ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ నాయకులు ఓ అమాయకుడి గుడిసెను కూల్చేశారని చెప్పుకోవటానికి వెళితే కూడా పట్టించుకోని తీరుగా ఉందన్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని..దౌర్జన్యాలతోనే మేం పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేదన్నారు పరిటాల శ్రీరామ్. రెవిన్యూ, పోలీస్ అధికారులు స్పందించకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు.టీడీపీ నాయకుడి ఇంటిని కూల్చే రోడ్డు వేస్తామంటే రేపు మా పాలన వస్తే మీ నటింట్లోంచి రోడ్లు పోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి గ్రామాల్లో జరుగుతున్న ఇటువంటి దారుణాలు తెలియవా? అని ప్రశ్నించారు.

Paritala Sreeram: పరిటాల రవి పేరు ఎక్కువగా తలచుకుంటున్నావు.. ధన్యవాదాలు..