Paritala Sriram : గుర్రాల కోట కేతిరెడ్డీ కూల్‌గా ఉంటే నీకే మంచిది: వైసీపీ ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హల్ చల్ చేసే కేతిరెడ్డి నీ లాగా సీఎం జగన్ ని కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేయమని చెప్పు..

Paritala Sriram : గుర్రాల కోట కేతిరెడ్డీ కూల్‌గా ఉంటే నీకే మంచిది: వైసీపీ ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

Paritala Sriram, Kethireddy Venkatarami Reddy (Pics: Google)

Paritala Sriram :  మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుర్రాల కోట అంటే కేతిరెడ్డి అక్రమాలు తెలుస్తాయని.. కేతిరెడ్డి కూల్ గా ఉంటేనే మంచిది.. ఎక్కువ టెన్షన్ పడద్దు అంటూ సెటైర్ వేశారు. పాదయాత్రలో లోకేశ్.. కేతిరెడ్డిపై విమర్శలు చేసేసరికి ఉలుకు బయటకు వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ఇక నుంచి నువ్వు చేసిన అక్రమాలు, భూకబ్జాలు, అవినీతి బాగోతాలు అన్నీ ప్రతి రోజు రాష్ట్రం అంతా వినిపించేలా బయటపెడతామని హెచ్చరించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉండవల్లిలో కట్టిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఈ విషయం కేతిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కొన్ని లక్షల మంది సమస్యలకు పరిష్కరించిన స్థలం ప్రజా వేదికను కూల్చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని పరిటాల శ్రీరామ్ విమర్శించారు. బ్యారేజీ ఉద్దేశ్య పూర్వకం ముంచేసి చంద్రబాబు ఇల్లు మునిగిపోయేలా చేశారని.. అందుకే బ్యారేజ్ కూలిపోయే పరిస్తితికి వచ్చిందని ఇదికూడా వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యమేనని విమర్శించారు. నీ గుర్రాల కోట వీడియో బయటకు రాగానే ఏది బడితే అది మాట్లాడు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నువ్వు ఫామ్ హౌసులు, బంగ్లాలు కట్టుకోవాలంటే నీ సొంత గ్రామంలో కట్టుకో.. అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తు ఆస్తులు పోగేస్తున్నావు.. ఇన్ని ఎకరాల భూములు, ఆస్తులు నీకు ఎక్కడినుంచి వచ్చాయి? బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులు లెక్క చెప్పు? అంటూ ప్రశ్నించారు.

Pawan Kalyan Delhi Tour: చెప్తా.. చెప్తా.. అందర్నీ కలిశాక అన్ని విషయాలు చెబుతా.. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా పవన్

ఆధారంలేని ఆరోపణలు నువ్వు చేస్తుంటూ చూస్తూ ఊరుకోం అని ఎక్కువ మాట్లాడే కొద్దీ నీవన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. కేసులు స్టేలు గురించి మాట్లాడితే వైఎస్ వివేకా హత్య కేసుల గురించి చెప్పాల్సి వస్తుంది.. నీ అక్రమాస్తులపై సిట్ వేసినప్పుడు స్టేలు తెచ్చుకో అంటూ ఎద్దేవా చేశారు.మర్యాద, గౌరవం గురించా మాట్లాడుతున్నావ్.. నువ్వా వాటి గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 28.30ఎకరాల అని చెబుతున్న కేతిరెడ్డికి.. వందల ఎకరాల భూములు ఉన్నాయని.. రైతులను బెదిరించి భూములు లాక్కున్న విషయం అందరికీ తెలుసు అంటూ విమర్శించారు. ఏ వ్యాపారము చేయని కేతిరెడ్డికి ఇన్ని వందల ఎకరాల భూములు ఎక్కడివి? అని ప్రశ్నించారు.

Paritala Sriram, Kethireddy
కేతిరెడ్డి నీ బోటింగ్ విహారాలకు నీరు సరిపోవని రైతులకు నీరు ఇవ్వకుండా నీటిని ఆపారని.. గుర్రాల మీద ఊళ్లో తిరుగుతూ పెద్దల్ని అవమానిస్తున్నారు అంటూ పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం అంటూ హల్ చల్ చేసే కేతిరెడ్డి నీ లాగా సీఎం జగన్ ని కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేయమని చెప్పు.. నీ భూ దందాలు, ఇసుక, మట్టి అక్రమాలన్నీ బయట పడతాయ్ అంటూ హెచ్చరించారు. నువ్ టీడీపీపై ఆరోపణలు చేస్తే నీ బండారం మొత్తం బయటపెడతాను అంటూ హెచ్చరించారు. నీ క్యారెక్టర్, నీ పద్ధతులు, నీ అక్రమాలు అన్నీ ప్రజల ముందుకు తీసుకోస్తామని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.

Tirupati Assembly Constituency: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?

నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా: కేతిరెడ్డి
తాను కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే లోకేశ్ రాజకీయాల నుంచి వైదొలగుతారా అని సవాల్ విసిరారు. కృష్ణా నదిని ఆక్రమించి నిర్మించిన ఇంట్లోనే చంద్రబాబు, లోకేశ్ నివసిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్టపై నిలబడి చేసిన వీడియోను కేతిరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు.