Pawan Kalyan Delhi Tour: చెప్తా.. చెప్తా.. అందర్నీ కలిశాక అన్ని విషయాలు చెబుతా.. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన పవన్.. సోమవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధరన్‌, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. మంగళవారం మరోసారి మురళీధరన్‌తో ఆయన నివాసంలో పవన్, నాదెండ్ల భేటీ అయ్యారు. సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాలతో పాటు పలువురు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.

Pawan Kalyan Delhi Tour: చెప్తా.. చెప్తా.. అందర్నీ కలిశాక అన్ని విషయాలు చెబుతా.. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా పవన్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటన (Delhi tour) లో బిజీబిజీగా ఉన్నారు. జనసేన పార్టీ (Jana Sena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో కలిసి బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్.. సోమవారం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధరన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన విషయం విధితమే. మంగళవారం పవన్, మనోహర్‌లు మరోసారి మురళీధరన్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వీరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది.

Pawan Kalyan Delhi Tour: కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ.. పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ.. వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

మురళీధరన్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పవన్ వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి పవన్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలుపైనా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

మురళీధరన్‌తో భేటీ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ను మీడియా ప్రతినిధులు భేటీ వివరాలు అడగగా.. పవన్ మాత్రం దాటవేశారు. చెప్తా.. చెప్తా.. అన్నీ చెప్తా.. అందరినీ కలిసిన తరువాత అన్ని విషయాలను చెప్తానంటూ మురళీ ధరన్ నివాసం నుంచి వెళ్లిపోయారు. అయితే, సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. వారితో పాటు మరికొందరు బీజేపీ పెద్దలను పవన్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Delhi Tour : హస్తినలో బిజీగా జనసేనాని

ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న పవన్ కళ్యాణ్ సోమవారం మరళీధరన్‌తో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వివరించారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్ధక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ‌తింటోందని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని పవన్ విజ్ఞప్తి చేశారు.